Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓర్వలేకనే మంత్రుల అనుచిత వ్యాఖ్యలు
- రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ-పినపాక
తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని, నికార్సైన కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగిన నాయకులకు పుట్టినిల్లని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం పినపాక టీడీపీ మండల అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ బయ్యారంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన మహాసభకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేసిన సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నాటికి నేటికి నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడి వెళ్ళినా, నిఖార్సాయిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు మాత్రం పార్టీని వీడలేదన్నారు. మహాసభకు జనం స్వచ్ఛందంగా తరలి రావడం బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రానున్న ఎన్నికల నాటికి టీడీపీ తిరిగి పుంజుకుని నిర్ణయిత శక్తిగా ఎదుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబాద్ పార్లమెంటరీ శాఖ కార్యదర్శి వాసిరెడ్డి చలపతిరావు, పినపాక నియోజకవర్గ బాధ్యులు వట్టం నారాయణ దొర, బూర్గంపాడు మండల అధ్యక్షులు తాళ్లూరు జగదీశ్వరరావు, నాయకులు షేక్ నబి, కొంపల్లి నాగేశ్వరరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : ఖమ్మం నగరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్న భారీ బహిరంగ సభకు స్వచ్చందంగా వచ్చి విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పరులకు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సభను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరి ప్రకాష్ రావు, సీనియర్ నాయకుడు వట్టం నారాయణ, వాసిరెడ్డి చలపతి రావు, తాళ్ళూరి జగదీష్, టీడీపీ వాసు, తుళ్ళూరి వీరన్న, బెజ్జంకి రవి, కూరపాటి చలపతి రావు, నంబూరి జానయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.