Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల చదువుపై ప్రధానోపాధ్యాయులతో పాటు, సంబంధిత సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లు ప్రత్యేక దృష్టి సారించి అత్యుత్తమ ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి సంబంధిత రిసోర్స్ పర్సన్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో పీఎంఆర్సి ఏసీఎంఓ రమణయ్య ఆధ్వర్యంలో సబ్జెక్టుకు సంబంధించిన రిసోర్స్ పర్సన్లతో పదో తరగతిలో 10/10 జీపీఏ పొందుట కోసం తీసుకోవలసిన చర్యలపై ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించాలంటే ఇప్పటినుండే వారికి సంబంధిత పాఠశాలలో ప్రత్యేక టైం టేబుల్ ప్రకారం సబ్జెక్టులలో బోధించాలన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆశ్రమపాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి స్టడీకి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించినందున దానికి తగినట్లు రిసోర్స్ పర్సన్లతోపాటు, ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు ప్రత్యేక దృష్టి సారించి చదువులో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ తరగతులు నిర్వహించి, ప్రతి పాఠశాలలో 10/10 జీపీఏ ఫలితాలు వచ్చే విధంగా బాధ్యతగా వ్యవహరించి ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఏసీఎంవో బావసింగ్, పర్యవేక్షకురాలు ప్రమీల భారు, జీసీడీఓ అలివేలు మంగతాయారు, రిసోర్స్ పర్సన్లు మధు, హనుమంతు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సరోజినీ, శాంతన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.