Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీ కస్టమర్ యాప్ 8976862090తో పూర్తి సమాచారం
నవతెంలగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్మికులకు ఎల్ఐసీ సంస్థ విస్తృత సేవలందిస్తుందని, అనేక సంవత్సరాలుగా ఈ బంధం కొనసాగుతుందని సంస్థ సిబ్బంది తెలిపారు. శుక్రవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాట్లు చేసిన ఉత్సవాల సందర్భంగా సింగరేణి యాజమాన్యం పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎల్ఐసీ సంస్థవారు స్టాల్ ఏర్పాటు చేసి సంస్థ అందిస్తున్న పాలసీలు, స్కీంలు కార్మికులకు వివరించారు. ప్రమాద బీమాలతో పాడు చిన్నపిల్లల కోసం ఎల్ఐసీ వారు తీసుకు వచ్చిన కొత్త పథకాలు వివరించారు. సింగరేణి వ్యాప్తంగా రూ.10 కోట్లమేర కార్మికులు ప్రిమియం చెల్లిస్తున్నారని తెలిపారు. సుమారు 1లక్ష పాలసీలు ఉన్నాయని చెప్పారు. క్లయిమ్ సెటిల్ మెంట్ రూ.1.20 కోట్లు అని తెలిపారు. స్టాల్ ఏర్పాటు చేసి కార్మికులను మరింత చైతన్య పరిచే విధంగా వివరించారు. పాలసీ దారులు ఎల్ఐసీ కస్టమర్ యాప్ 8976862090 వాట్సాప్తో ఎల్ఐసీ అందజేస్తున్న పాలసీలు, పాలసీ దారులకు ఉన్నా పాలసీ వివరాలతో పూర్తి సమాచారం తెలిపే విధంగా ఏర్పాటు చేసిందని విరించారు. స్టాల్లో జీవన్ అక్షరు పెన్షన్స్కీమ్ గురించి, జీవన్ శాంతి, ప్రధాన మంత్రి వయో వందన యోజన (పిఎంవివివై) స్కీం, ధనరేఖ 863, 945 జీవన్ ఉమంగ్, ఆరోగ్యరక్ష, ధనవర్ష లాంటి స్కీమ్ల గురించి కార్మికులకు వివరించారు. చిన్నపిల్లల కోసం జీవన్ తరంగ్ స్కీం ఎంతో ఉపయోగంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగులు సీనియర్ బ్రాంచి మేనజర్ కె.కామేశ్వరరావు, రాజారావు, ఏఓ విజయానంద్, రవికుమార్, డి. సాయిశ్రీమంత్, శ్రీనివాస్, లత, లక్ష్మీ, రోజా, ఝాన్సీ తదితరులున్నారు.