Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ కొనకండ్ల వెంకటరెడ్డి
నవతెలంగాణ-చండ్రుగొండ
మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి నియమించాలని జడ్పీటీసీ కొనకండ్ల వెంకట రెడ్డి అన్నారు. చండ్రుగొండలో మండల కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 40 సంవత్సరాల కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎంపిక జరిగే విధానాన్ని జిల్లా అధ్యక్షుడు విస్మరించారని ఆ విధానాన్ని తీవ్రంగా సమావేశంలో ఖండిస్తున్నామని అన్నారు. అందువల్ల మండల అధ్యక్షుడు ఎంపికను రద్దుచేసి మెజార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు అధ్యక్షుడి ఎంపిక ప్రకటించవలసి ఉండగా ఆ పద్ధతికి విరుద్ధంగా జరగడం పట్ల కార్యకర్తలు జిల్లా నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ 10 పంచాయతీల కార్యకర్తలు నాయకుల తీర్మానం చేశారు. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధిష్టానం ప్రకటించిన మండల అధ్యక్షుడిని గుర్తించడం లేదన్నారు. ఒక పక్క రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కమిటీలు రద్దు అయినట్లు ప్రకటించారని మరోపక్క పీసీసీ అధ్యక్షుడు ఆదేశాలతోనే నియమించామని డీసీసీ అధ్యక్షుడు ప్రకటించడం క్రమశిక్షణ రాహిత్యమేనని జడ్పిటిసి వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా డిసిసి ప్రకటించిన గోవిందరెడ్డి నియమ కాని పక్కనపెట్టి తిరిగి నూతన అధ్యక్షుడిగా మద్దుకూరుకు చెందిన నల్లమోతు రమణ చండ్రుగొండకు చెందిన కేశవ అయిన నరసింహారావు వీరు ఇరువురిలో ఒకరిని నియమించాలని హాజరైన నాయకులు కార్యకర్తలు తీర్మానించారు. ఆ తీర్మానాన్ని జిల్లా రాష్ట్ర కమిటీలకు పంపనున్నట్లు జడ్పిటిసి తెలిపారు . ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ బాబు కాంగ్రెస్ సేవా సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కో దుమూరి దయాకర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు అంతటి రామకృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చాపలమడుగు రాములు, మండల కాంగ్రెస్ నాయకులు ఇంజమ్ అప్పారావు, చుండ్రు విజయ్, ఐఎన్టీయూసీ షేక్ మదర్ సాహెబ్ మాజీ సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.