Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీర్
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశ ప్రధమ మహిళ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు ఏర్పాట్లు ఘనంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈ నెల 28వ తేదీన భారత రాష్ట్రపతి భద్రాచలం పర్యటన పురస్కరించుకొని విధులు కేటాయించిన జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆయన అధి కారులను ఆదేశించారు.హెలిపాడ్లు ఏర్పాటు ప్రక్రియ గురించి ఆర్ అండ్ బి ఈ ఈ భీంలాను అడిగి తెలుసుకున్నారు. పటిష్టమైన, కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెప్పారు. మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రపతి నిర్వహించ నున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్ఐసి సిబ్బందిని ఆదేశించారు. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా 26వ తేది వరకు కేటాయించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అధికారులు సంసిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధుసూదనరాజు, డిపిఓ రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్ ఈ రమేష్, ఆర్ అండ్ ఈ ఈ భీమ్లా, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్, వైద్యాధికారులు డాక్టర్ శిరీష, డాక్టర్రవిబాబు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత, రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.