Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2029-30 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
- మరో నాలుగేళ్లలో 3 వేల మెగావాట్ల విద్యుత్
- సింగరేణి భవన్లో వైభవంగా సింగరేణి దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాలరీస్ కంపెనీ నేటి పోటీ మార్కెట్‌ను తన బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలతో ధీటుగా ఎదుర్కోనున్నదని, మరో ఐదేళ్ల లో 10 కొత్త గనులు, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో సుస్థిర ఆర్థిక పునాదులు ఏర్పరచుకొని ముందుకు పోనున్నదని, మరో వందేళ్ల వరకు సింగరేణి సంస్థకు తిరుగు ఉండదని సింగరేణి సంస్థ డైరెక్టర్ పా చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ముందుగా సింగరేణి డే వేడుకల సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు. ఉత్సవాలకు సూచికగా బారీ బెలూన్న్ నింగిలోకి విడిచారు. ఈ సందర్బంగా అన్ని స్టాల్స్ పరిశీలించారు. వారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్థ 133 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తోందన్నారు. నేటి పోటీ మార్కెట్లో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలతో కూడా పోటీ పడి నిలదొక్కుకునే సామర్థ్యం ఉందన్నారు. దేశంలో ఒక అగ్రగామి కంపెనీగా నిలిచిందన్నారు. బొగ్గు ఉత్పత్తిని 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెంచుకోవడం జరిగిందని, టర్నోవర్ ను 12 వేల కోట్ల నుంచి 26 వేల కోట్లకు పెంచుకోవడం జరిగిందన్నారు. ఇదే ఒరవడితో ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నామని, తద్వారా 32 వేల కోట్ల టర్నోవర్, 2 వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్స్ ఫైనాన్స్ ఎన్.బలరామ్, డైరెక్టర్ ఈఅండ్ ఎండి.సత్యనారాయణ, జీఎంలు బసవయ్య, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఏర్పాట్లు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
రుద్రంపూర్ ఏరియాలో....
కొత్తగూడెం ఏరియాలో ఘనంగా 134వ సింగరేణి దినోత్సవ వేడుకలు నిర్వహిచారు. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి దినోత్సవ వేడుకలల్లో ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ సింగరేణి తల్లి చిత్ర పటానికి పూల మాలను వేసి, పతాక ఆవిష్కరణ చేసి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. వీరితో పాటు కొత్తగూడెం ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలడుగు శ్రీనివాస్, రమేశ్, జక్కం వాణి రమేశ్, ఫాతిమా రజాక్, మాధవి నారాయణ రావు, ఆర్.నారాయణ రావు, సూర్యనారాయణ, రవీందర్, పి.స్యాముయెల్ సుధాకర్, ఆంజనేయశెట్టి, వెంకటేశ్వర్లు, యోహన్, శర్మ, కిరన్ బాబు, అన్నీ మైన్స్ డెపార్ట్మెంట్స్ హెడ్స్, అధికారులు, సుపెర్వైసర్స్, ఉద్యోగులు, గౌతంపుర్ సేవా సెక్రటరీలు పాల్గొన్నారు.