Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండాలలో బొగ్గు గనులకు ప్రయత్నాలు
- సంబరాల వేడుకలలో ఎమ్మెల్యే హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
నూతనంగా ఏర్పాటు చేయనున్న పూసపల్లి ఓసి ప్రైవేటుపరం కాకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాల ఆట స్థలంలో శుక్రవారం రాత్రి సింగరేణి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే హరిప్రియ, జీఎం శాలెం రాజు, సేవా సంఘం అధ్యక్షురాలు మధురవాణి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓసి మూతపడితే ఇల్లేందును విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందేమో అనేసి కార్మికుల భయపడుతున్నారని అలా కాకుండా చూస్తామన్నారు. ఇక్కడ ఉండేటటువంటి కార్మికులు ఉద్యోగస్తులతో పాటుగా మరింత మంది ఇల్లందులో రావాలని కోరుకుంటామే తప్ప వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అనేసి ఏ రోజు అనుకోరు అన్నారు. గుండాల దగ్గర బొగ్గు అనేది చాలా ఉంది వాటిని ప్రారంభోత్సవం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
రాబోయే రోజుల్లో గుండాలలో ఉత్పత్తి స్టార్ట్ అయితే కొత్తగూడెంను మైమరిపించే విధంగా రేపు ఇల్లందు ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు. కాబట్టి ఇల్లందుకి బొగ్గు అయిపోతుంది అనేటటువంటి ఏమాత్రం భయం ఉండకూడదన్నారు. ఎమ్మెల్యేగా నాలుగు సంవత్సరాలు జర్నీలో అడుగడుగునా అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించి వెన్ను తట్టి మా సంస్థ ఉంది అనేసి ముందుకు నడిపించినటువంటి సింగరేణి యాజమాన్యానికి వారి సిబ్బందికి సింగరేణి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.