Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ప్రగతి సీఎం కేసీఆర్తో సాధ్యం
- జిల్లా కేంద్రం వద్ద జరిగిన ధర్నాలో రేగా
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు, జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం నుంచి, బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహంచారు. అమరవీరుల స్థూపం వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధి హామీ పథకాన్ని 50 శాతం రైతులకు పెట్టాలని అనేక దఫాలుగా కేంద్రానికి వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు, కేంద్రం మాత్రం ఈ పథకాన్ని ఎత్త్తి వేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కల్లాలు చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు. గత 8 నెలల నుంచి రూ.1100 కోట్లు నిధులు విడుదల చేయకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, అశ్వారావుపేట ఎమ్మెల్యే మేచ్చ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ కంచర్ల చంద్రశేఖర రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ , ఇల్లందు మున్సిపల్ చైర్ పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పాల్గొనడం జరిగింది.