Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కు పత్రాల కోసం మరో పోరాటం
- రేపాకుల శ్రీనివాస్
నవతెలంగాణ-టేకులపల్లి
పోడు భూములకు హక్కు పత్రాల సాధనకు మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పోడు సాగుదారులకు పిలుపునిచ్చారు. సోమవారం సంపత్ నగర్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశం లో ఆయన మాట్లాడారు. పోడు భూముల సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని అనేక పోరాటాల ఫలితంగా అటవీ హక్కుల చట్టం వచ్చిందన్నారు. ఆ చట్టం అమలు కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సర్వే చేసిన భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 29 న ఖమ్మం లో జరిగే పేదల బహిరంగ సభ కు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నరసింహారావు, కడుదుల వీరన్న, పాయం వెంకన్న, రవీందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
తరలిరండి: ఎంబీ నరసారెడ్డి పిలుపు
భద్రాచలం : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు ఇంటికో మనిషి వాడకో బండి చొప్పున తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక రాజుపేట కాలనీలో సోమవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఖమ్మంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకి కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ వస్తున్నారని కావున పట్టణ ప్రజలు వందలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తున్నందున ఆ భారాల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తాన్ని అదాని,అంబానీ లాంటి పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని కావున ఈ విధానాన్ని వ్యతిరేకించాలని కోరారు. నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని భద్రాచలానికి జరిగే అన్యాయాన్ని వ్యతిరే కించాలని, భారత రాష్ట్రపతి రాకతో స్థానిక ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని రాష్ట్రపతి అంటే అందరికీ గౌరవం ఉన్నదని కావున అధికారులు కూడా ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కన్వీనర్, డి లక్ష్మి, స్థానిక నాయకులు రాంబాబు, లక్ష్మీకాంతం, రామకృష్ణ, రామచంద్రరావు, నాగలక్ష్మి పాల్గొన్నారు.
వ్యాకాసం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
ఇల్లందు : ఈ నెల 29న ఖమ్మంలో వ్యవసాయం రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు లక్షలాదిమంది తరలిరావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి కిరణ్ పిలుపునిచ్చారు. ఇల్లందు మండల వ్యాప్తంగా ఆటో ప్రచారం కార్యక్రమం ప్రారంభించి మండలంలోని అన్నీ గ్రామలు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంల సీఐటీయూ నాయకులు నబి, తాళ్లూరి కృష్ణ, మణ్యం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు
ములకలపల్లి : సీపీఐ 98వ ఆవిర్భావ వేడుకలను మండల వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎండీ. యూసఫ్, నాయకులు బాటి రమేష్, వీరు, జబ్బార్, ఖాసీం, ముఖేష్, నాగేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం
చంద్రుగొండ : చండ్రుగొండ మండల పార్టీ కార్యాలయంలో, సితాయిగూడెం శాఖ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గార్లపాటి రామనాథం, జడ శ్రీను, మండల కార్యదర్శి బొర్రా కేశవరావు జెండావిష్కరించారు.
పజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే
సిపిఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరరావు
బూర్గంపాడు : సిపిఐ 98వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని బూర్గంపాడులో సిపిఐ జెండాను సిపిఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు, మండల సహాయ కార్యదర్శి పాండవుల బిక్షం, సిద్ధార్థ సుబ్బారెడ్డి, ఏఐటియుసి అధ్యక్షులు ఎండి సాజిద్, భీమా వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
మహాసభను జయప్రదం చేయండి
సుజాతనగర్ : ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామం ఆధ్వర్యంలో ప్రభాతభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు వీర్ల రమేష్ మాట్లాడుతూ కేరళ రాష్ట్రం ఈ దేశానికి ఆదర్శమని వ్యవసాయ కూలీలకు కూలి చట్టం అమలు చేసి ఆరు వందల రూపాయలు రోజు కూలి ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వీర్ల సత్యం, ఎల్లబోయిన బాబు, వీర్ల వసంత, జక్కుల కృష్ణ, బండారి నాగరాజు, పట్టాభి, తదితరులు పాల్గొన్నారు.
వ్యకాస రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
అశ్వాపురం : మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం మండల ముఖ్య కర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వీరబోయిన జయంతి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మోకాళ్ళ రమేష్ మాట్లాడుతూ మహాసభల ప్రాముఖ్యతను వివరించారు. మండలం నుండి వందలాదిగా తరలి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి, ఉపేంద్ర, లీల రాయుడు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.