Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఈ నెల 28వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు విధులు కేటాయించిన అధికారులు 27వ తారీకు ఉదయం 11 గంటలకు విధులకు రిపోర్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో విధులు కేటాయించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతుందని కేటాయించిన విధులను పూర్తి చేసి అధికారులు సంసిద్ధతగా ఉండాలని చెప్పారు. విధులు కేటాయించిన అధికారులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాలలో విధులలో సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. దేవాలయంలో షామియానాలు, కార్పెట్ వేయాలని చెప్పారు. దేవాలయంలో గ్రీన్ రూము సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమని అధికారులు మినిట్ టు మినిట్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. స్వామివారి ప్రత్యేక పూజలు అనంతరం వీరభద్ర ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారని చెప్పారు. కొమ్ముకోయ నృత్యంతో రాష్ట్రపతికి స్వాగతం ఉంటుందని ఆయన తెలిపారు. తదుపరి వర్చువల్ ద్వారా మహబూబాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించనున్నారని అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అంబులెన్సులు, ప్రత్యేక వైద్యులను అందుబాటులో ఉంచాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయు విధంగా చర్యలు చేపట్టాలని, ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేయుటకు జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆయన విద్యుత్ అధికారులకు సూచించారు. అగ్నిమాపక వాహనాలు, ఫైర్ ఎస్టిన్ గ్విష్ లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. పాసులు లేని వ్యక్తులను అనుమతించమని చెప్పారు. విధులు కేటాయించిన సిబ్బంది తప్పని సరిగా ఆర్టీపిఆర్ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని చేపించు కోవాలని తెలిపారు. అతిధులను గైడ్ చేయుటకు నియమించిన లైజన్ అధికారులను సంసిద్ధంగా ఉండాలని సూచించారు. మన జిల్లాకు అతిథులు వస్తున్నారని ఎలాంటి లోటుపాట్లు రాకుండా అందరం సమన్వయంతో పని చేసి పర్యటన విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పతి పర్యటన సందర్భంగా ఆంక్షలు ఉన్నాయని ప్రజలు యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు.
ఎస్పి డాక్టర్ వినీత్ మాట్లాడుతూ హెలిప్యాడ్, ఐటిసి, దేవాలయం, వీరభద్ర ఫంక్షన్ హాల్ లో విధులు కేటాయించిన సిబ్బంది ఆ ప్రాంతాల్లోనే ఉండాలని చెప్పారు. 28వ తేదీ ఉదయం 7 గంటలకే కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆయన సూచించారు. 8 గంటల నుండి రాక పోకలు పటిష్ట నియంత్రణ ఉంటుందని చెప్పారు. అధికారులు బాధ్యతగా కేటాయించిన ప్రాంతాల్లో విధులకు హాజరు కావాలని చెప్పారు. గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని మాత్రమే అనుమతిస్తామని, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను అనుమతించమని, పటిష్ఠ బాందోబస్తు ఉంటుందని ఆయన తెలిపారు. విధులు కేటాయించిన అధికారులు వారి కేటాయించిన ప్రాంతాల్లో ఉండాలని, ఒకచోట నుంచి ఇంకో చోటికి అనుమతించరని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పి రోహిత్ రాజ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.