Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేగా కామెంట్స్‌పై కాలమే సమాధానం చెబుతుంది
- మణుగూరు సబ్‌డివిజన్‌లో పొంగులేటి విస్తృత పర్యటన
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పోటీలో ఉంటారని ఖమ్మం పార్లమెంట్ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనీవాసరెడ్డి అన్నారు. సోమవారం పినపాక సబ్ డివిజన్లో అశ్వాపురం, పినపాక, మణుగూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. మండలంలో సుమారు అన్ని గ్రామాలను సుడిగాలి పర్యటనతో ప్రజలను కలుసుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. అనంతరం కిన్నెర కళ్యాణమండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు జననాయకుడని ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రేగా కాంతారావు కామెంట్స్‌పై మాట్లాడుతూ దేశంలో వాక్ స్వాతంత్య్రం అందరికి ఉన్నదన్నారు. ఎవరైెనా మాట్లాడవచ్చన్నారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిడి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, అశ్వాపురం ఎంపిపి ముత్తినేని సుజాత, మణుగూరు వైస్ ఎంపిపి కరివేద వెంకటేశ్వరరావు, (కెవిరావు), సమితిసింగారం ఉప్సర్పంచ్ పుచ్చకాయల శంకర్, ముత్యాలమ్మ నగర్ ఉపసర్పంచ్ తరుణ్‌రెడ్డి, అధికసంఖ్యలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.