Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గొర్రెల, మేకల డెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న యాదవులు అన్ని రంగాలలో రాణించాలని రాష్ట్ర గొర్రెలు, మేకల డెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా పర్ణశాల రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆయన సీతాకుటీర ప్రదేశం, నారచరీల ప్రాంతాలను సందర్శించి పర్ణశాల యొక్క చరిత్రను అడిగి తెలుసుకున్నారు. కాగా పర్ణశాల రామాలయ దర్శనానికి వచ్చిన ఆయన దుమ్ముగూడెం పిఏసిఎస్ డైరెక్టర్ బొల్లి సూర్చందర్రావు ఆద్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం తూరుబాక గ్రామంలోని బొల్లి సూర్యచందర్‌రావు నివాసం వద్ద యాదవ సంఘం ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా బాలరాజు యాదవ్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్ది నాయకుడిగా తాను చేసిన ఉద్యమాలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కార్పోరేషన్ చైర్మన్ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి యాదవ కుటుంబాలకు గొర్రెల యూనిట్ అందేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. భద్రాచలం, పర్ణశాల రామాలయ దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చిన నాకు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనం స్వాగతం పలికినందు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకన్న యాదవ్, కుమ్మరింకుంట సాంబశివరావు, బొల్లి సత్యనారాయణ, జంగిలి సంపత్, బాలకృష్ణ, జెట్టి రామకృష్ణ, జక్కుల సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.