Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఈనెల 29న ఖమ్మం నగరం ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరగబోతున్న భారీ బహిరంగ సభకు లక్షల మంది కదిలి రావాలని సిఐటీయూ జిల్లా నాయకులు వై విక్రమ్ కోరారు. సోమవారం సుందరయ్య భవనం వద్ద ఆటో ప్రచారాన్ని వై విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా లక్షల మంది ప్రజలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రతి కుటుంబాన్ని పార్టీ కార్యకర్తలు కలిసి బహిరంగ సభకు రావాలని ఆహ్వానం చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, టి.విష్ణు, మనోహర్, జె.వెంకన్న బాబు, బిబీ, సాగర్, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు
ముఖ్యమంత్రి సభ గ్రౌండ్‌ను పరిశీలించిన
ఏసీపీ, సీపీఐ(ఎం) నేతలు
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 29న ఖమ్మం రానున్న నేపథ్యంలో ఆయన భద్రత ఏర్పాట్లు, అయన హాజరు అవుతున్న డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌ను సోమవారం ఖమ్మం నగర ఏసిపి ఆంజనేయులు, సిపిఎం నాయకులు పరిశీలన చేశారు. 29న ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బిజినెస్ ఆర్ డిగ్రీ కాలేజీలో భారీ బహిరంగ సభ జరగబోతుందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సభా వేదికను, ముఖ్యమంత్రి వచ్చే రహదారులపై ఏర్పాట్లపై ఏసిపి సూచనలు చేశారు. నగరంలోకి వచ్చే వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో సూచనలు చేశారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి వచ్చే భారీ ర్యాలీకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఏసిపి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్ పాల్గొన్నారు.
కూసుమంచి : వ్యకాస రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా మండలంలోని నాయకన్‌గూడెం గ్రామం నుండి ఖమ్మంరూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామం వరకు నేషనల్ హైవే పక్కన మహాసభల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు శీలం గురుమూర్తి, తోటకూరి రాజు, మల్లెల సన్మంరావు, అశోక్, శ్రీను, తాటి నరసరావు, బిక్కసాని గంగాధర్ పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం కోరుతూ సంఘం మండల కార్యదర్శి మూడు గన్యా నాయక్, సంఘం ఉప అధ్యక్షుడు శీలం గురుమూర్తి సోమవారం జెండా ఊపి మైకు ప్రచార రథంను మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎడవల్లి రమణారెడ్డి, మండల కమిటీ సభ్యులు తోటకూరి రాజు, మల్లెల సన్మంతరావు, సీనియర్ నాయకులు కోరుట్ల పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : ఈ నెల 29,30,31 తేదీల్లో ఖమ్మం పట్టణంలో జరుగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు కోరారు. సోమవారం సత్తుపల్లి పట్టణంలో మహాసభల ప్రచార రథాన్ని పాండురంగారావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, రమేశ్, కృష్ణ, నాగరాజు, రవి, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు, సతీశ్, మారేశ్, లక్ష్మణ్, వెంకటేశ్, రామ్, సైదా, చరణ్, తేజ, బాబు పాల్గొన్నారు.
ముదిగొండ : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ముదిగొండలో ఆటో ప్రచారాన్ని సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య ఎర్రజెండా ఊపి సోమవారం లాంఛనీయంగా ప్రారంభించారు. మండలం నుంచి సభకు 6వేల మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్, మండల నాయకులు మందరపు వెంకన్న, బట్టు హనుమంతరావు, ఉప్పు భాస్కర్, కట్టకూరి ఉపేందర్, కుర్రి ఉపేందర్, నంగునూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
కమలాపురం, ముదిగొండ, వెంకటాపురం, చిరుమర్రి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం కరపత్రాలు పంచుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ముదిగొండ, వెంకటాపురం గ్రామాల్లో 29న ఖమ్మంలో జరిగే కార్మిక సంఘ బహిరంగసభ విజయవంతంకై ఇంటి ముందు రంగవల్లికలువేసి వినూత్నంగా ప్రచారం చేపట్టారు.వాలంటీర్లతో ఉదయం, సాయంత్రం కవాతు నిర్వహిస్తున్నామని ఈకవాతుకు యువత, యువకులు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, నాయకులు మరికంటి వెంకన్న, టీఎస్ కళ్యాణ్, కే.కుటుంబరావు, మందరపు వెంకన్న, మందరపు పద్మ, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్, కందుల భాస్కరరావు, నెమిలి సైదులు, కట్టకూరి ఉపేందర్, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు బట్టు రాజు, మెట్టెల సతీష్, సుధాకర్, సాయిరాం, ఉప్పు భాస్కర్, కుర్రి ఉపేందర్, వీరశేఖర్, పారుపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కారేపల్లి : వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర మహాసభలలో భాగంగా ఈనెల 29 న జరగనున్న భారీ బహిరంగ సభ విజయవంతానికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం ప్రభాతభేరి మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాటిమీదిగుంపు, బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, చింతలతండా, బోటితండా, స్టేషన్ చీమలపాడు, నానునగర్తండాల్లో సీపీ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర ఆధ్వర్యంలో ప్రభాత భేరి ర్యాలీ జరిపారు. ఈ సందర్బంగా నరేంద్ర మాట్లాడుతూ పేదలకు పక్కా ఇండ్లు పోడుకు హక్కు, నిరుద్యోగ సమస్య, ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు, దళితులకు గిరిజనులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ వంటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర పాలకులపై ఒత్తిడి తీసుకరావటానికి బహిరంగసభ ఎంతో ఉపకరిస్తుందన్నారు.
కోలాటంతో అలరించిన మహిళలు
వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు తరలిరావాలని కోరుతూ మాణిక్యారంలో మహిళలు కోలాట నృత్యాలతో ప్రదర్శన చేశారు. మహిళలు, చిన్నారులు కోలాటం చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు, నాయకులు దారావత్ సైదులు, యనమగండ్ల రవి, కే.ఉమావతి, కల్తి రామచంద్రు, కరపటి సీతారాములు, ఎర్రయ్య, సూరబాక సర్వయ్య, మాలోత్ రాంకోటి, రాచబంటి పుల్లయ్య పోతురాజు చందర్రావు, ఎస్కె.సైదులు, మావోత్ హనుమా, బచ్చల వెంకటేశ్వర్లు, చంద్‌పాషా, మల్లమ్మ, పాయం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి : జాస్తపల్లి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రం మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉపతల వెంకన్న, రాయల సత్యనారాయణ, దుగ్గి పాపారావు, రాయల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు : వ్యకాస మహాసభలను జయప్రదం చేయాలని సోమవారం విస్తృత ప్రచారం చేశారు. చంద్రుపట్ల గ్రామంలో గొర్రెల మేకల పెంపకందారుల మండల కార్యదర్శి బట్టు నరసింహారావు ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. కార్మికుల పనుల వద్దకు వెళ్లి మిత్రులకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు.
తల్లాడ : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విజయవంతం చేయాలని కోరుతూ మండల పరిధిలోని అన్నారుగూడెం గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు సిపిఎం గ్రామ శాఖ సభ్యులు ముచ్చింతల చెన్నయ్య, తాళ్లూరి రాములు, సిపిఎం నాయకులు పులి వెంకట నరసయ్య, అమర్లపూడి భవాని, నాగు, షేక్ సైదా, సుభాని, చెన్నయ్య, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.