Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ-ఖమ్మం
ఎస్ఐ, కానిస్టేబుల్ ఎంపికను పాత పద్ధతిలో నిర్వహించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని మంచికంటి భవనంలో సంఘం జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన '' ఎస్సై, కానిస్టేబుల్ ఎంపిక పాత పద్ధతిలో జరగాలని అభ్యర్థులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ ఏండ్ల తరలబడి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా గ్రహణం పట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇది నిరుద్యోగులకు శాపంగా మారిందని, తక్షణమే ఏడు మల్టిపుల్ ప్రశ్నలకు సంబంధించి హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. తొమ్మిది ప్రశ్నలకు కానిస్టేబులు, ఏడు ప్రశ్నలకు ఎస్సై తప్పు ప్రశ్నకు సంబంధించిన మార్కులు అందరికి కలపాలని కోరారు. లాంగ్ జంప్, షాట్ పుట్కి సంబంధించిన మెయిన్స్ ప్రస్తుతం ఇలా పెంచడం వల్ల శారీరక నియామక పరీక్షల్లో చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1600 మీటర్స్ రన్నింగ్ అనంతరం రెండు గంటలు విరామం ఇవ్వాలని, లేదా మరుసటి రోజు లాంగ్ జంపు, షార్ట్ ఫుట్ నిర్వహిం చాలని కానీ ఒకేరోజు నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్ర నష్టపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ వేరువేరుగా నిర్వహించాలని కోరారు. ఎత్తుకు సంబంధించిన డిజిటల్ విధానాన్ని తీసేసి పాత పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాత పద్ధతిని కొనసాగించి నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్ లేక కరోనా మహర్మరి నుంచి తీవ్ర ఆర్థికంగా ఇబ్బంది పడి కానిస్టేబుల్ అర్హత పరీక్షల్లో ఎంపికైన వారికి కొత్త పద్ధతి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇప్పటికే హైకోర్టు తప్పుడు ప్రశ్నలకి మార్కులు కలిపి అర్హత కోల్పోయిన వారికి ఈ మార్కుల ద్వారా అర్హత చేయాలని, హైకోర్టు ఆర్డర్ని పరిగణలో తీసుకో వాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందో ళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ఈ రౌండ్ టేబుల్ సమా వేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్, పఠాన్ రోషిని ఖాన్, పొరపాటి శ్రీను, శీలం వీరబాబు, రావులపాటి నాగరాజు, పొన్ను మురళి, పాషా, శ్రీకాంత్, పాపారావు, సురేష్తో పాటుగా కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా పాల్గొన్నారు.