Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
మరుగున పడుతున్న జానపద కళాకారులకు చేయితనిచ్చి ప్రోత్సహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మంలోని మంచికంటి భవనంలో సారిపల్లి కొండల్రావు ఫౌండేషన్ సౌజన్యంతో జానపద కళాకారులకు నగదు పురస్కారం యువకల వాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జానపద కళాకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా 10 కళాబృందాల టీమ్‌లకు పదివేల రూపాయలు చొప్పున బహూకరించారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు సారేపల్లి కొండారావు ఫౌండేషన్ సంస్థను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య , కాళ్లోజీ అవార్డు గ్రహీత డాక్టర్ సీతారాం, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి చిర్ర రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, కవి రమణాచారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళా కారులు సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు విజయశ్రీ, రాష్ట్ర కార్యదర్శి పమ్మి రవి, ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోలూరి రాము, ఆరెంపుల సతీస్, రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, పల్లె సుద్దుల శ్రీను, నంద్యాల నాగేశ్వరరావు, గుడిపల్లి పుల్లారావు, అద్దంకి నరసింహారావు, కొచ్చర్ల గురవయ్య, ప్రేమ్ కుమారి, చంద్రమోహన్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.