Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి వర్ధంతిలో భట్టి
నవతెలంగాణ - ఎర్రుపాలెం
సుదీర్ఘ కాలం రాజకీయాలకే ప్రాధాన్యతను ఇచ్చి జిల్లాలో సాగర్ జలాల ద్వారా సాగు నీటిని అందించి రైతుల బీడు భూములను సస్యశ్యామలం చేశారని, చివరి కంటూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. బనిగండ్లపాడు గ్రామంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ మంత్రి, మాజీ మధిర శాసనసభ్యులు స్వర్గీయ శీలం సిద్ధారెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భట్టి విక్రమార్క సిద్ధారెడ్డి కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సిద్ధారెడ్డి కృషి మరువలేనిదని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పటల్ను సందర్శించి రోగులకు పండ్లను పంచిపెట్టారు. 30 పడకల హాస్పటల్ని ఆరు పడకల హాస్పిటల్‌గా మార్చారని, గతంలో ఉన్న 30 పడకల హాస్పిటల్‌గా కొనసాగేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు భట్టికి వివరించారు. అనంతరం గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్ర మైన ఎర్రుపాలెం వ్యవసాయ మార్కెట్ యార్డు నందు గల వరి ధాన్యాన్ని పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు బండారు నరసింహారావు, తల్లపరెడ్డి నాగిరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, షేక్ ఇస్మాయిల్, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, దండెం సత్య నారాయణరెడ్డి, ఎర్రమల శ్రీనివాస్‌రెడ్డి, అనుమోలు కృష్ణారావు, కడియం శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, లింగాల నాగేశ్వరరావు, రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.