Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లను పూర్తి చేసిన అధికార యంత్రాంగం
నవతెలంగాణ-భద్రాచలం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలం వస్తున్నారు. రాష్ట్రపతి ఈ సందర్భంగా భద్రాద్రి రామున్ని దర్శించుకుంటారు. అనంతరం గిరిజనులతో ప్రత్యేక సమావేశం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలం, సారపాకలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 144 సెక్షన్ విధించారు. రాష్ట్రపతి పర్యటించనున్న రహదారుల వెంబటి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే హెలిపాడ్ ట్రయల్ రన్ చేపట్టారు. రహదారి వెంట కాన్వారు ట్రయల్ కూడా నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు భారీ ఎత్తున బందోబస్తు భద్రాచలం తరలివచ్చింది. భద్రాచలంలో పూర్తి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ భద్రాచలంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశ ప్రధమ పౌరులు పర్యటన సందర్భంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయని అట్టి ఆంక్షలు ప్రజలు తు.చ.తప్పగా పాటించాలని ఆయన సూచించారు. రాష్ట్రపతి పర్యటనకు 350 మంది అధికారులు, 2వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉదయం 7 గంటల నుండే ఆంక్షలు కొనసాగుతాయని, ప్రజలు రహదారులలోకి రావద్దని రాకపోకలు నిలిచిపో తాయని చెప్పారు. దేశంలో అత్యంత ప్రోటోకాల్ భద్రత ఉన్న రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విధించిన ఆంక్షలకు ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
- సారపాక ఐటీసీలో ఏర్పాట్లు పూర్తి
- అరుదైన ఘనత...ఐటీసీ సొంతం
- పోలీసు వలయంలో సారపాక ప్రాంతం
- కొనసాగుతున్న 144 సెక్షన్
బూర్గంపాడు : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటనకు సారపాక అంతా సర్వం సిద్ధమైంది. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలి కాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ బీపీఎల్ స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్లో రాష్ట్రపతి దిగనున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దర్శనం, దర్శించుకున్న అనంతరం పలు పథకాలను ప్రారంభించనున్నారు. అదే విధంగా రాష్ట్రపతి భద్రాచలంలో గిరిజనులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఐటీసీ బీపీఎల్ స్కూల్, ఐటీసీ గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాలలో పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అరుదైన ఘనత ఐటీసీ సొంతం...
సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారం అరుదైన ఘనతను దక్కించుకోనుంది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఐటీసీకి రానున్నారు. భద్రాచలంకు గతంలో రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, శంకర్ దయాల్ శర్మలు వచ్చారు. సుదీర్ఘకాల అనంతరం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భద్రాచలం బుధవారం రానున్నడంతో ఐటీసీ అతిధ్యం ఇవ్వనుంది. ఈ మేరకు సారపాక ఐటీసీ పరిసర ప్రాంతాలు రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. ఐటీసీలో బస చేయనున్న తొలి రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము నిలవనున్నారు. ఇందుకోసం ఐటీసీ ఉన్నత అధికారుల బృందం తగిన ఏర్పాట్లలో నిమగమైంది.
పోలీసుల వలయంలో సారపాక
బుధవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సారపాకలో ల్యాండ్ అయిన అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్లో కొంత సమయం గడిపిన అనంతరం భద్రాచలం పర్యటనకు వెళ్ళనున్నారు. దీంతో సారపాక, భద్రాచలం ప్రాంతాలు పోలీసులు వలయంలో ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో పోలీసులు ఇప్పటికే సారపాక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు అన్ని ప్రాంతాలలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో సారపాక ప్రాంతం పోలీసుల వలయంతో నిండిపోయింది. అదేవిధంగా రాష్ట్రపతి బుధవారం పర్యటించడంతో సారపాక, భద్రాచల ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. భద్రాచలం నుంచి సారపాక వరకు రాకపోకలను నిలిపి వేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రకటన సైతం చేశారు. భద్రాచలం ఆర్టిసి డిపో సైతం బూర్గంపాడులో ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో నిమగమైంది. అదే క్రమంలో భద్రాచలంకు అన్ని వైపుల నుంచి సారపాక నుంచి వెళ్లే వాహనాల రాకపోకలు నిలుపుదల చేశారు.
ట్రయల్ రన్ సక్సెస్
రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం సారపాకలోని ఐటీసీ బీపీఎల్ స్కూల్ నుంచి ఐటీసీ గెస్ట్ హౌస్, సారపాక మీదుగా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం, అనంతరం వీర భద్ర ఫంక్షన్ హాల్ వరకు ట్రయల్ రన్ అధికార యంత్రాంగం నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పర్య వేక్షణలో ట్రయల్ రన్ సక్సెస్ అయింది.