Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేస్ట్ టూ బెస్ట్ సందర్శన కార్యక్రమమంలో మున్సిపల్ చైర్మన్, కమిషనర్
నవతెలంగాణ-ఇల్లందు
పనికిరాదనుకొని పడేసిన వాటితో ఆకర్షణీయంగా రంగు రంగుల వివిధ రకాల వస్తువులను కళాత్మకకంగా తయారు చేసి ప్రదర్శించిన విద్యార్థినీ, విద్యార్థుల సృజనాత్మకత అద్భుతమని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకూష్షావలి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో భాగంగా ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో వేస్ట్ టు బెస్ట్ పనికిరాని వస్తువులను కూడా పనికొచ్చే విధంగా తయారు చేసి వాటిని పట్టణ ప్రజలు సందర్శించేందుకు మంగళవారం కార్యక్రమంచే పట్టారు. పట్టణంలోని వివిధ స్కూల్లో విద్యార్థినీ, విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అంశంపై డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు తయారుచేసిన వేస్ట్ టు బెస్ట్ వస్తువులను పట్టణ ప్రజలు చూసేందుకు ఇల్లందు మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేశారు. విద్యార్థి విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల వస్తువులను చూసి ప్రజలు ప్రజాప్రతినిధులు ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో భాగంగా వేస్ట్ టు బెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజలంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకుషావలి, మున్సిపల్ కౌన్సిలర్లు తారా, అంకె పాక నవీన్ కుమార్, కుమ్మరి రవీందర్, వారా రవి, కటకం పద్మావతి, కడకంచి పద్మ, రజిత, సయ్యద్ ఆజాం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.