Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల భాగంగా మంగళవారం స్వామివారు వామనవతారంలో భక్తులకు దర్శనమి చ్చారు. తొలుత పల్లకిలో స్వామివారిని ఊరేగింపుగా మిధుల ప్రాంగణానికి తీసుకొని వచ్చారు. అక్కడ స్వామివారిని వేయించేయింప చేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వామనవతారంలో ఉన్న భద్రాద్రి రామున్ని వీక్షించి తరించారు.
వామనావతారంలో పర్ణశాల రామయ్య
దుమ్ముగూడెం : భద్రాచల రామాలయానికి అనుబంద ఆలయమైన పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామి వారిలో ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అద్యయనోత్సవాలలో భాగంగా పర్ణశాల రామయ్య దశవతారంలో భాగంగా మంగళవారం ఐదవ రోజు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవతల సర్వసంపదలను తన స్వాదీనం చేసుకున్న రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామన రూపంలో వెళ్లి మూడు అడుగులను ధానంగా స్వీకరించి, మూడు లోకాలను కొలిచి బలి అహాన్ని అణిచి అనుగ్రహించాడు. ఈ అవతారాన్ని ధరించడం వలన గురుగ్రహ భాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని ధరించడం వలన వాటి నుండి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నట్లు పురోహితులు శేషం కిరణ్కుమారా ఆచార్యులు, భార్గవాచార్యులు, వెంకటాచార్యులు తెలిపారు. మద్యాహ్నం 2 గంటలకు ఆలయ ఆవరణలో హరికధాకాలక్షేపం నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామ పుర వీధుల్లో మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి తిరుమల ఆరాధన కార్యక్రమం అనంతరం 7.30 గంటలకు స్వామివారి ఆరగింపు వంటి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్చార్జీ చంటికుమార్, సిబ్బంది రాము, శివ తదితరులు పాల్గొన్నారు.