Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరిలో రెండవ విడత గొర్రెల పంపిణీ
- రాష్ట్ర మేకల, గొర్రెల అభివృద్ధికార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ బాలరాజ్ యాదవ్
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రం జీవాల పెంపకం, మాంసం ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉందని, రానున్న జనవరి నెలలో రెండవ విడల గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకుంటుంన్నట్లు తెలంగాణ రాష్ట్ర మేకల, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తెలిపారు. జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2017లో ప్రారంభించిన గొర్రెల పథకానికి 7లక్షల61 వేల896 మంది లబ్దిదారులకు గాను, 7 లక్షల31 వేల 595 మందిని అర్హులుగా గుర్తించారని, మొదటి విడతలో 3లక్షల 93 వేల522 మంది లబ్దిదారులకు రూ.5వేల 1 కోట్లతో 84లక్షల74 వేల గొర్రె పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో లబ్దిదారులక ఎంతో మేలు జరిగిందని చెప్పారు. ఒక్కో యూనిట్ పొందిన లబ్దిదారుడు 5ఏండ్ల కాలంలో రూ.10 నుండి రూ.15లక్షలు సాధించారని తెలిపారు. గొర్రెల స్కీం వలన అనేక మంది లబ్ది పొందారని చెప్పారు. పేదల కష్టాల నుండి కళ్యాణలక్ష్మీ, షాదీమూబారక్, కెసీఆర్కిట్స్ పథకాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మంచి నాణ్యమైన మాంసం ఉత్పత్తి , సరసమైన ధరలకు అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జనాభా ఎంత ఉందో అదే దామాషాలో జీవాలు, పశువులు ఉన్నాయని, అదే విధమైన వైద్యం, సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణకు టీకాలు, మందులు అందజేస్తుందో అదే విధంగా మూగ జీవాలకు సైతం పశు సంవర్థక శాక ద్వారా మందులు, టీకాలు అందజేస్తు పశు సంపదను కాపాడుతున్నారని తెలిపారు. ప్రజలకు 108 వాహనం ఎలా ఉందో, పశువలు ఆరోగ్యానికి 1962 వాహనం పశువుల రక్షణకు ఉందని వివరించారు. జనవరిలో రెండవ విడత గొర్రెల పంపిణీకీ రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ తయారు చేసిందని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి హరిత హారం ఎంతో బాగుందని, అందులో భాగంగా భద్రాచలం పశుఅసుపత్రిలో మామిడి మొక్కను నాటినట్లు తెలిపారు. రెండవ విడతలో లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో యూనిట్సొమ్ము చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి విడతలో రూ.1లక్షా 25 వేల ఇచ్చిందని, రెండవ విడతలో రూ.1లక్షా 75 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డాక్టర్ డాక్టర్ పురందర్ పాల్గొన్నారు.