Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి వ్యవసాయ కార్మికసంఘం బహిరంగసభకు ఇలా రండి...
- మధ్యాహ్నం 3 గంటలలోపైతేనే నగరంలోకి ప్రవేశం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలో ఈనెల 29న నిర్వహించే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగసభకు వచ్చే వాహనాల పార్కింగ్, రూట్‌మ్యాప్ వివరాలను ఆ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో వివరించారు. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. దీనికి ముందు 3 గంటలకు ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు 3 గంటలలోపే నిర్దేశిత ప్రాంతాల్లో సభకు వచ్చేవారిని దించి నిర్ణీత ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మార్గాల్లో వచ్చే వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలి...సభకు వచ్చేవారిని ఎక్కడ దించాల్సిన వివరాలు ఇలా ఉన్నాయి...
పార్కింగ్...దించాల్సిన ప్రదేశాలు...
- కోదాడ మార్గంలో నేలకొండపల్లి, ముదిగొండ నుంచి వచ్చే వాహనాలు వెంకటగిరి క్రాస్‌రోడ్డు మీదుగా ప్రకాశ్‌నగర్, బోస్‌సెంటర్ మీదుగా ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద సభకు వచ్చేవారిని దించాలి. తిరిగి ఆ వాహనాలు చర్చి కాంపౌండ్ ప్లైఓవర్ మీదుగా వెళ్లి మమతా రోడ్డు లకారం పార్కు పక్కన ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేయాలి.
- మధిర నియోజకవర్గం మొత్తం బోనకల్ రోడ్డులో అగ్రహారం బ్రిడ్జి, ముస్తఫానగర్, చర్చికాంపౌండ్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చి అర్బన్ తహశీల్దార్ ఆఫీస్ వద్ద ప్రయాణీకులను దించి తిరిగి పీఎస్ఆర్ రోడ్డు, చర్చికాంపౌండ్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లి లకారం పార్కు వద్ద ఖాళీ ప్రదేశంలో వెహికిల్‌ను పార్క్ంగ్ చేయాలి.
- అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, ఇటు అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా వైరారోడ్డులో వచ్చే వాహనాలు శ్రీశ్రీ సర్కిల్ వద్ద సభికులను దించి, పక్కనే కొంత దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో వాహనాలను నిలిపివేయాలి.
- ఇల్లెందు రోడ్డులో వచ్చే వాహనాలు సభికులను దించాక మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్‌హాల్ వెనుక భాగంలో పార్కింగ్ చేయాలి.
- వరంగల్, సూర్యాపేట నుంచి వచ్చే వాహనాలు సభికులను జూబ్లిక్లబ్ వద్ద దించి ఎఫ్‌సీఐ పక్కన ఉన్న మేకల నారాయణ ఫంక్షన్‌హాల్ పక్కన ఖాళీ ప్రదేశం, బైపాస్ రోడ్డు నుంచి దాన్వాయిగూడెం వెళ్లే ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలు, రాపర్తినగర్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్ పక్క నుంచి వెళ్తే ఉండే ఎంపీ గాయత్రి రవికి చెందిన ఖాళీ సైట్లో వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
- వాహనాలన్నీ కూడా 3 గంటలలోపు వస్తేనే నగరంలోకి అనుమతిస్తారు. లేదంటే నగర శివారు ప్రాంతాల నుంచి నడిచి రావాల్సి ఉంటుందని గమనించాలి.
- వాహనాల పార్కింగ్, రాకపోకలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అంబడిపూడి సుధాకర్ (9848582636), వజినేపల్లి శ్రీనివాసరావు (8187804416), మోటమర్రి జగన్మోహన్రావు (9948477260)లను ఫోన్లో సంప్రదించాల్సింగా సూచించారు.