Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
గుర్తుతెలియని వాహనం ఢకొని జింక మృతి చెందిన ఘటన సత్తుపల్లి శివారు వేంసూరు రోడ్డులోని మెట్టాంజనేయస్వామి గుడి సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. పక్కనే ఉన్న అర్బన్పార్కు నుంచి బయటకు వచ్చిన జింక రోడ్డు దాటే క్రమంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అర్బన్పార్కులో సుమారు 250కు పైగా జింకలు ఉన్నాయి. పార్కు నిర్వాహకులు జింకలు ఫెన్సింగ్ దాటి వెళ్లకుండా ఉండేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వలనే ఈ విధంగా మూగజీవాలు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నాయని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కులో ఉన్న వన్యప్రాణులు బయటకు రాకుండా, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జంతుప్రేమికులు అటవీఅధికారులను కోరుతున్నారు.