Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబద్ధతతో సమిష్టిగా పనిచేస్తున్నారు
- డీజీపీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించడంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది నిబద్ధతతో సమిష్టిగా పనిచేస్తున్నారని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదు డీజీపీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఖమ్మం నుండి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. నిర్దిష్టమైన ప్రణాళిక, నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో రాష్ట్రంలో నేరాల కట్టడిలో అధ్బుతమైన పురోగతి సాధించారన్నారు.పోలీస్ శాఖ ఆధునీకరణలో భాగంగా పోలీసు సిబ్బంది వ్యక్తిగత వృత్తి పరమైన పని సామర్ధ్యాన్ని పెంపొందించి అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్స్ విధానం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ ఎగినేస్ట్ క్రైమ్, గ్రేవ్ కేసుల్లో నిందితులను చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడంతో పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుగైన ఫలితాలు సాధిస్తున్నార న్నారు. ప్రధానంగా పోలీస్ అధికారుల మార్గనిర్దేశంతో నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్ట్, చార్జ్‌షీట్ సమయలలో కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారానే క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్, పోక్సో, ఎస్సీ ఎస్టీ వంటి కేసులలో పురోగతి సాధించారన్నారు. విలువైన సాంకేతిక సౌలభ్యాన్ని సమర్థవంతంగా వినియోగించి సైబర్ సెల్, ఐటి సెల్, టెక్నికల్ బృందాలు వ్యవస్థీకృత నేరాలను నివారించడానికి శాంతి భద్రతల పరిరక్షణలో అంచనాలకు మించిన అద్భుత విజయాలను సాధిస్తున్నారన్నారు. కేసులపై పోలీస్ అధికారులు తరచూ రివ్యూ చేస్తూ.. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌తో సమన్వయం చేసుకుంటూ.. సాక్ష్యాలను సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టి జిల్లాలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ..కేసు విచారణలో తీసుకోవలసిన చర్యలపై మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ వివరించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్రబోస్, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమార స్వామి, ఏఎస్పీ అంక్షాంశ్ యాదవ్, ఏసీపీ వెంకటేశ్, రహెమాన్, వెంకటస్వామి, రవి, బాబురావు పాల్గొన్నారు.