Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ సీఈవో వింజం అప్పారావు
నవతెలంగాణ-చింతకాని
నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేసి గ్రామపంచాయతీలు అభివృద్ధి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో వింజం అప్పారావు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పన్నుల సకాలంలో వసూలు చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. దళిత బంధు పథకం యూనిట్లు సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కలిగించాలన్నారు. డైరీ లబ్ధిదారులు ఇంకా గేదెల కొనుగోలుకు వెళ్ళని వారిని గుర్తించి వెంటనే వారిని గేదెలు కొనుగోలు చేసేలా సంసిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.