Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే వేటు తప్పదు
- జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి
నవతెలంగాణ-కామేపల్లి
విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే వేటు తప్పదని ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు. భాసిత్ నగర్, పొన్నెకల్లు గ్రామాల్లో పాఠశాలలను సందర్శించి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించడంతోపాటు విద్యార్థులకు విద్యను ఎలా అందింస్తున్నారనే విధానాన్ని స్వయానా ఆమె పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం భోజనంను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మన మన ఊరు మన బడికార్యక్రమం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో గుప్తా, ఈఓఆర్డి వెంకట సత్యనారాయణ, ఉపాధ్యాయులు సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.