Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
చివరి ఎకరా వరకు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో చైర్మన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాసంగి పంటల సీజన్ 2022-2023 మేజర్, మీడియం, మైనర్, లిఫ్ట్ ఇర్రిగేషన్లపై సమీక్షించారు. సాగునీటికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే తక్షణమే వాటిని సవరించి నీటి వృథాను అరికట్టి నీరు అందించాలని నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు గతేడాది ఈ సంవత్సరం నీరు పుష్కలంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్‌లో సమృద్ధిగా ఉందని, నీటికి ఎలాంటి కొరత లేదని, మొదటి విడత నీరు ఇవ్వడం కొనసాగుతూనే ఉందన్నారు. యాసంగికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలో ఎస్.ఆర్.ఎస్.పి కింద విడుదలయ్యే దానికి, మీడియం, మైనర్ ఇర్రిగేషన్కు సంబంధించి ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మిషన్ కాకతీయ, చెక్ డ్యాం సమస్యలేమనా ఉన్నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా యాసంగికి కావాల్సిన నీటి లభ్యత సమృద్ధిగా ఉందని, మంత్రివర్యుల సూచనలతో ఎప్పటికప్పుడు ఇర్రిగేషన్ అధికారులతో సమీక్షిస్తున్నామని ఎలాంటి కొరత ఉండదని కలెక్టర్ తెలిపారు. మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రధానంగా నాగార్జున సాగర్ కు సంబంధించి ప్రధానంగా పాలేరు, వైరా, సత్తుపల్లి మూడు నియోజకవర్గాలు నాగార్జున సాగర్ పై ఆధారపడి ఉన్నాయని, జిల్లా మొత్తం వ్యవసాయాధారితమైనదని, సాగర్ కెనాల్ ద్వారా సాగునీరు సమృద్ధిగా వస్తేనే జిల్లా స్యశ్యామలమ వుతుందని తెలుపారు. ఆ దిశగా మనకు వచ్చే నీటిని తెప్పించేదుకు ఇర్రిగేషన్ ఉన్నతధికారులతో చర్చించి పరిశీలన చేయాల్సిందిగా కోరారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కెనాలు సంబంధించిన భూములను కాపాడు కోవాల్సిన అవసరం ఉందని సూచించారు. వైరా నియోజకవర్గంకు బుగ్గవాగుపై చెక్ డ్యామ్‌కు, కారేపల్లి మండలంలో 41 ఎకరాలకు ఉన్న సమస్యను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, శాసనమండలి సభ్యులు తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్, అదనపు కలెక్టర్ మధుసూధన్, ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్త, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు శంకర్ నాయక్, ఖమ్మం, కల్లూరు రెవిన్యూ డివిజన్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, జిల్లా ఉద్యన పన శాఖ అధికారి అనసూర్య, నీటి పారుదల, వ్యవసాయం, హార్టికల్చర్, రెవెన్యూ శాఖ అధికారులు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.