Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామం ముస్లిం కాలనీ 4 వార్డ్ పరిధిలో ముమ్మరంగా డ్రైనేజ్ పారిశుద్ధ్య పనులు వార్డు మెంబర్ షేక్ ఖాసింబి పర్యవేక్షణలో మంగళవారం నిర్వహించారు. కరోనా 4వ వేవ్ మళ్లీ విజృంభిస్తుందని ఊహాగానాల మధ్య స్థానిక పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఖాసింబి కోరారు. దీంతో స్థానిక ప్రజలు తమ పరిసరాలని శుభ్రంగా ఉంచేందుకు నడుం బిగించారు. ఆరోగ్య సమస్య ఏమైనా తలెత్తితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు తిరుపతి, పరసగాని పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.