Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘాలకతీతంగా కార్మికులంతా ఏకతాటి మీదికి రావాలి
- రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- కొత్తగూడెంలో సంఘర్ష యాత్రకు ఘన స్వాగతం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది నటువంటి రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 3వ తారీకు నుండి 11వ తారీకు వరకు ఖమ్మం నుండి సంగారెడ్డి జిల్లా వరకు రవాణా కార్మికుల సంఘర్ష యాత్రను ప్రారంభించామని ఈ యాత్రలో భాగంగా యాత్ర రథసారథులు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్ అన్నారు. మంగళవారం సాయంత్రం కొత్తగూడెం పట్టణంకు సంఘర్షణ యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా జాతాకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. జాతా నాయకులను సీఐటీయూ కొత్తగూడెం పట్టణ కమిటీ, రవాణా కార్మికులు, ఆర్టీసీ కార్మికులు యాత్ర నాయకులకు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ వద్దకు ర్యాలీగా తీసుకురావడం జరిగింది. అనంతరం బస్టాండ్ దగ్గర సిఐటియు పట్టణ కార్యదర్శి డి.వీరన్న అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సంఘర్ష యాత్ర రథసారథి ఎస్.వీరయ్య మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె, అనంతరం ఆర్టీసీ కార్మికుల మీద తీవ్రమైన వేధింపులు ఒత్తిడి పెరిగిందని సంఘాలు ఉండొద్దని సమ్మెలు చేయొద్దని యాజమాన్యం ప్రభుత్వం చెప్తున్నా వాదన సరైన కాదని, సమ్మె చేసి సంఘం పెట్టే హక్కు స్వాతంత్రం పూర్వమే రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని ఆయన తెలియజేశారు. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం కళ్లు తెరిచి కార్మికులపైన వేదింపులు ఆపాలని ఆయన తెలియజేశారు. ఆర్టీసీని పరిరక్షించుకునే దానికోసం సంఘాల కతీతంగా కార్మికులంతా ఏకతాటి మీదికి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. రవాణా రంగా రాష్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ ఆటో ట్రాలీ, డీసీఎం, లారీ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు సౌకర్యం కల్పించాలని, వారు కోరినచోట అడ్డాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, 2019 రవాణా చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ మాట్లాడుతూ ఈ యాత్ర సందర్భంగా అనేక కార్మిక ప్రాంతాలు కార్మిక అడ్డాలు తిరుగుతున్న క్రమంలో అనేక మంది కార్మికులు తమ ఆవేదనను ఈ రకంగా వెలిబుచ్చారని తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ చలానాలు అధికంగా వేస్తున్నారని, ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఎక్కువయ్యాయని, విపరీతంగా ఓవర్ బడ్డెన్ మీద చలానాల వసూలు చేస్తున్నారని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర అనంతరం అనేక జిల్లాల వారీగా దశల వారి కార్యక్రమాలు పోరాటాలు ఉంటాయని వాటిలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలు తెలుసుకుంటూ వారిని చైతన్య పరుస్తూ సంఘటితం చేస్తూ ముందుకెళ్తుందని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది నటువంటి రవాణా రంగ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించ దిశగా ఆలోచిం చాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎంఎన్.రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎస్డబ్య్లూఎఫ్్ డిపో కార్యదర్శి జాకబ్, సిఐటియు జిల్లా నాయకులు జి.పద్మ, కె.సత్య, భూక్య రమేష్, లిక్కి బాలరాజు, గాజుల రాజారావు, అంబాల దుర్గ మ్మ, సింగరేణి నాయకులు జి.శ్యామ్, ఆటో యూ నియన్ నాయకులు సయ్యద్, శ్యాం, సింగరేణి నాయ కులు కర్ల వీరస్వామి, వెంకటమ్మ, నవీన్, ఆర్టీసీ, కార్, ట్రావెల్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రవాణా రంగ కార్మికులకు
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
మణుగూరు : రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని టీఎస్ ఆర్టీసీ పరిరక్షించాలని తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సురక్ష బస్టాండ్‌లో రాష్ట్ర వ్యాప్తగా జరిగే రవాణా కార్మికుల సంఘర్ష యాత్రలో మాట్లాడుతూ కేరళ తరహాలో సవారి తరహా యాప్‌ను దేశవ్యాప్తంగా తీసుకురావాలన్నారు. ఆర్టీసీ కార్మిక ఉద్యమంపై ఆంక్షలు ఎత్తివేయాలి డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి ఆర్థిక భారం నుండి కార్మికులను కాపాడాలి అన్నారు. పెంచిన ఓవర్ లోడ్ పెనాల్టీ, గ్రీన్ టాక్స్‌ను తగ్గించాలన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీసులు ట్రాఫిక్ చలానాలు అధికంగా వేస్తున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజ్ రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, కోడిశాల రాములు, నందం ఈశ్వరరావు, సీఐటీయూ మండల కన్వీనర్ ఉప్పుతల నరసింహారావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు బాణాల రాంబాబు, కె.వి.రామారావు, సిహెచ్ ఉపేందర్ రావు, కంగాల రామకృష్ణ, తాటి సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు, ఎస్.కే.సలీం, ఎన్.జి.రెడ్డి, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల సీఐటీయూ నాయకులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.