Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1535 డైరీ ఆవిష్కరణ సభలో జి.రఘుమారెడ్డి
నవతెలంగాణ-పాల్వంచ
విద్యుత్ సంస్థల్లో నెలకొని ఉన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి టీఎస్ జెన్కో ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి విచ్చేస్తామని టీఎస్ ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 నూతన సంవత్సర 2023 డైరీని హైదరాబాద్లోని ఎస్పీడీసీఎల్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ సెంట్రల్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎంఏ.వజీర్, టి.రాధాకృష్ణలు విద్యుత్ సంస్థల్లో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ కార్మిక ఆర్టిజన్ సిబ్బందికి ఒకటి ఏప్రిల్ 2022 నుండి రావాల్సిన వేతన బకాయిలను, ఒకటి ఫిబ్రవరి 1999 నుండి 31 ఆగస్టు 2004 వరకు ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని 23,000 మంది ఆర్టిజన్ కార్మికులకు పర్సనల్ పేలను బేసిక్ పేలో కలపాలని టీఎస్ జెన్కోలో అమలులో ఉన్న కన్వర్షన్ విధానాన్ని టిఎస్ఎస్ పిడిఎస్లో అమలుపరిచి ఆర్టీసీలకు జేఎల్ఎంగా జూనియర్ అసిస్టెంట్లుగా సబ్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం రఘుమారెడ్డి కార్మిక సంఘం నాయకులకు హామీ ఇవ్వడంతో యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ తకి ఎస్ లవ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి గౌసుద్దీన్, అంబాల శ్రీను, రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎం.శ్రీధర్, కోశాధికారి టి.విజరు కుమార్, టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష కార్యదర్శులు నగేష్, రవి, ఎన్పీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, ఎం.శ్రీనివాస్, అమిరుద్దీన్, ఎన్పీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు కౌసర్ పాషా, అసిఫ్, బిటిపిఎస్ రీజియన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, మనోహర్, కేటీపీఎస్ ఏడోదశ రీసన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ధనయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.