Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి
నవతెలంగాణ-భద్రాచలం
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు, ఐఏఎస్, ఐపీఎస్ సహా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా లక్షల రూపాయలు వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం రెండేండ్లుగా గిరిజన కార్మికులకు వేతనాలు చెల్లించకుండా పస్తులు ఉంచటం ఎంతవరకు న్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి ప్రశ్నించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పీఎంహెచ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ యందు పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల బకాయి వేతనాలను విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెను భద్రాచలంలో బ్రహ్మచారి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. గిరిజన కార్మికుల పట్ల వారి శ్రమ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమ శాఖకు ఏ మాత్రం కూడా గౌరవం లేదని విమర్శించారు. పెండింగ్లో ఉన్న రెండు సంవత్సరాల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్మికుల సమస్యలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించటం లేదని, అటువంటి మంత్రి గిరిజన సంక్షేమాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. గిరిజన కార్మికులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చులకనగా ఉందని విమర్శించారు. ప్రతి కార్మికుడికి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికులకి కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా 400 మంది డైలీ వర్కర్లు కూడా నిరవధిక సమ్మెలోకి వస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం హెచ్డి అధికారులు యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ హీరోలాల్ మాట్లాడుతూ వేతనాలు చెల్లించేంతవరకు సమ్మె యదావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు నకరికంటి నాగరాజు, జి.లక్ష్మీకాంత్, శీలం సత్యవతి, కనితి శారదా, శ్రీను, గుండి రాధా, జాడి లక్ష్మి, కారం లక్ష్మి, తుర్రం వెంకట్రావు, రాములు, తిరుపతమ్మ, తిరుపతయ్య, తిరుపతమ్మ, సమ్మక్క, నాగమణి పాల్గొన్నారు.