Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ప్రతి అక్షరం ప్రజల కోసమే రాసే పత్రిక నవతెలంగాణ అని అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు అని అన్నారు. నవతెలంగాణ క్యాలెండర్‌ను రిపోర్టర్‌తో కలసి మంగళవారం మెచ్చా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ అక్షర రూపంలో ప్రభుత్వానికి చూపిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నవతెలంగాణ పత్రిక ఎంతో ముందుంటుందని, అలాంటి పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషం అని అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో అన్నపురెడ్డిపల్లి మండల తశీల్దార్ భద్రకాళి, ఎంపీడీఓ రేవతి, మహేందర్, సంఘం సభ్యులు కొండా సతీష్, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.