Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ
- హాస్టల్ వర్కర్ల నిరవధిక సమ్మె ప్రారంభం
నవతెలంగాణ-పాల్వంచ
గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ కళాశాల అనుబంధ పీఎంహెచ్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న డైలీ వేజ్, అవుట్సోర్సింగ్ కార్మికుల ఆకలి బాధలు ప్రభుత్వానికి పట్టవాని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ అన్నారు. 22 నెలలుగా జీతాలు లేక అల్మటిస్తున్న కార్మికులు రావలసిన బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎంహెచ్ హాస్టల్ ఎదుట సీఐటీయూ (అనుబంధం) తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరోధిక సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ జిల్లా పీఎంహెచ్ ఔట్సోర్సింగ్ వర్కర్లకు 22 నెలలుగా వేతనాలు లేవని డైలీ వర్కర్లకు 8 నెలలుగా వేతనాలు బకాయి ఉన్నాయని ఇప్పటికే అనేకసార్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కి, కలెక్టర్‌కు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాత మధు, జిల్లాలోని ఎమ్మెల్యేలకు, ఐటీడీఏ పీవోకు, డీడీకి పత్రాలు అందజేశామని, అయినప్పటికీ అధికారులు, ప్రభుత్వం వేతనాలు చెల్లించటానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పాల్వంచ టౌన్ కన్వీనర్ కే.సత్య, జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్, పీఎంహెచ్ హాస్టల్ వర్కర్లు రామా టాగూర్, సీతమ్మ, వీరభద్రమ్మ, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.