Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడటానికి, సరైన పద్ధతిలో నిధులు రాకపోవడానికి ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాచలంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో అభివృద్ధి ప్రగతి పదంలో నడిపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావలసిన నిధులను రాబట్టడంలో అధికారులు తోపాటు, ప్రజాప్రతితులు విఫలం చెందారని అన్నారు. రోడ్లు, చెరువులు, చెక్‌డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణం, తదితర సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాల వద్ద నుండి నిధులు రాబట్టడంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక శాసనసభ్యులు విఫలం చెందారని ఆరోపించారు. ఈ సంవత్సర కాలంలోనైన ప్రజా ప్రతనిధులంతా ఐక్యంగా ప్రభుత్వాలనుండి నియోజిక అభివృద్ధికి నిధులు సాధించటానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ కూడా మద్దతు ఇస్తామని తెలిపారు. రాజకీయ సమస్యలుగా ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు, రైల్వే లైన్, కరకట్ట వంటి ప్రధాన సమస్యలను కూడా సాధించుకోవటానికి పోరాడాలని పిలుపునిచ్చారు. రానున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి పాలక పార్టీలు ప్రజాసమస్యలు పట్టించుకోవాలని కోరారు. నియోజక వర్గంలో పోడు భూముల సమస్యలు కీలకంగా ఉన్నాయని అన్నారు. సర్వేలు, గ్రామ సభలు పూర్తి అయినా ఫైనల్ చేసిన లబ్దిదారుల పేర్లు చూస్తే సమస్య ఝటిలమయ్యేల ఉన్నదన్నారు. నియోజిక వర్గ, జిల్లా స్థాయి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఫారెస్ట్ అధికారుల అతి జోక్యం సమస్యకు ములంగా వుంటుందని అన్నారు. ఈ సారైనా పోడు భూముల సమస్యలు పరిష్కారం కాక పోతే ప్రజా ఆందోళన ఉధృతం అవుతుందని అన్నారు. కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి.నర్సారెడ్డి, ములుగు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బాకట్ల లక్ష్మయ్య, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక, వంకా రాములు, యలమంచి వంశి, మర్మం చంద్ర య్య, సున్నం గంగ, నరేష్, మచ్చా రామారావు, చంటి, సమ్మక్క, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.