Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేటలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎమ్) కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని మహిళా టీచర్లను మంగళవారం సన్మానించారు. ముందుగా భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘంస్కర్త, సావిత్రిబాయి ఫూలే జయంతి (మహిళ ఉపాధ్యాయ దినోత్సవం), సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులు చేసిన టీఎల్ఎమ్ పరికరాలను ఎమ్మెల్యేకి వివరించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, బ్యాగ్లు పంపిణీ చేశారు. నేడు మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక మహిళ టీచర్ను ప్రత్యేకంగా ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విద్యావ్యవస్థను బలోపేతం చేసి గురుకుల పాఠశాలలతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, మండల స్థాయి టీఎమ్ఎల్ మేళా కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు చేసిన పరికరాలు వెనకబడిన విద్యార్థులకు సులభంగా అర్ధం అయ్యే విధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, సర్పంచ్లు చిన్న వెంకటేశ్వర్లు, దుర్గ, లక్ష్మయ్య, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.