Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ వేతనాలు చెల్లించాలి అ సీఐటీయూ సీనియర్ నాయకులు నెల్లూరి
నవతెలంగాణ-మణుగూరు
పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జూనియర్ కళాశాల గేటు ముందు నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయడంలో విఫలమైందన్నారు. నూతన పీఆర్సిని అమలు చేయాలన్నారు. కనీస వేతనం రూ.15,600 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడిశాల రాములు, ఉప్పతల నరసింహారావు, మహిళా సంఘం నాయకురాలు వై.నాగలక్ష్మి, ఖతిజా బేగం, కెవిపిఎస్ నాయకులు నాగళ్ళ శ్రీనివాస్, కార్మికులు సిహెచ్.జలంధర్, పి.మల్లూరమ్మ, ఏ.స్వరూప, మానస పాల్గొన్నారు.