Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోతులు పట్టించండి
- పబ్లిక్ టాయిలెట్, డ్రైనేజ్ నిర్మించండి
- గ్రామస్తుల డిమాండ్
నవతెలంగాణ-చండ్రుగొండ
గ్రామ సభకు అధికారులు హాజరు కాకపోవడంతో గ్రామస్తుల సమస్యలను విన్నవించుకునేందుకు వీలు లేకుండా పోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం చండ్రుగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఉప సర్పంచ్ దెబ్బెందుల బాబురావు అధ్యక్షతన జరిగింది. గ్రామాల్లో కోతులతో తట్టుకోలేక పోతున్నామని వాటిని వెంటనే పట్టించాలని, పబ్లిక్ టాయిలెట్, లేకపోవడం వల్ల ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డ్రైనేజీ లేకపోవడం వల్ల దుర్గంధం, దోమలతో రోగాల పాలవుతున్నామన్నారు. అనేక సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఉపేందర్, జడ్పీటీసీ కొనకళ్ళ వెంకటరెడ్డి, వార్డు సభ్యులు మల్లేశ్వరి, నీలవర్ణ, లింగం నాగులు, టీడీపీ మండల అధ్యక్షులు వారాధి సత్యనారాయణ, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ నాయకులు కేశ బోయిన నరసింహారావు, చాపల మడుగు వెంకటేశ్వర్లు, బుంగ శ్రీను, ప్రసాద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.