Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ వినీత్.జి
- నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆపరేషన్ స్మైల్ ద్వారా బాలల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని ఎస్పీ డాక్టర్ వినీత్.జి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలోని ఆపరేషన్ స్మైల్-9లో భాగంగా డీస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీసు బృందాలతో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ ఏర్పాటు చేశారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హౌమ్కు తరలించడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను, వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హౌమ్కు తరలించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. ఈ సమావేశంలో డిసిఆర్బి డిఎస్పి నందీరామ్, షీ టీం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమాదేవి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ లేనీనా స్వర్ణలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ అంబేద్కర్, సాదిక్ పాషా, సుమిత్రా దేవి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హరి కుమారి, లీగల్ ఆఫీసర్ శివ కుమారి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హత సాధించిన వారికి ఉచిత తరగతులు : ఎస్పీ
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో తుది పరీక్ష కోసం అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచితంగా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ తరపున ఈ ఉచిత తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకొరకు అర్హత సాధించిన అభ్యర్థులు జిల్లా పోలీస్ వెబ్సైట్లో పొందుపరిచిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. లింకు ద్వారా జిల్లా పోలీస్ వెబ్సైట్ ను ఉపయోగించి అందులో అభ్యర్థుల రిజిస్ట్రేషన్ కోసం చేర్చిన లింక్ ఈ నెల 12వ తేదీ వరకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం ఉచిత తరగతులను నిర్వహించే వేదిక, తేదీలను వెల్లడిస్తామని తెలిపారు.