Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చిరిగిన, పాడైపోయిన గన్నీబ్యాగులు ఉండడం వలన మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని దీని వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు యలమంచి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సీతారాంపురం, నర్సాపురం గ్రామాలలో నిర్వహిస్తున్న దాన్యం కొనుగోలు కేంద్రాలన వారు పరీశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక రైతులు ధాన్యం విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. సీతారాంపురం గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు అందుబాటులో ఉంచిన గన్నీ బ్యాగ్స్ మొత్తం పాతవి కావడంతో వాటి ద్వారా దాన్యం కొనుగోలు చేయడానికి మిల్లర్లు నిరాకరించడం వలన ఇప్పటి వరకు ఒక లారీ లోడు మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు రైతులు ధాన్యం ఆరబోసుకోవడం కోసం కనీసం టార్పాలిన్లు కూడా అందుబాటులో లేని పరిస్తితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకులు సంబందిత అధికారులు కొత్త గన్నీ బ్యాగ్స్‌తో పాటు టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరీశీలించిన వారిలో రైతు సంఘం నాయకులు కొడాలి లోకేష్ బాబు, రైతులు కారం సీతారాములు, సున్నం రమేష్, కల్లూరు రాజు, సోయం రత్తయ్య, సాయి, సోడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.