Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్య కేంద్రీకరణను, వ్యాపారీకరణను, కాషాయీ కరణను అరికట్టాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. టిఎస్‌యూటిఎఫ్ జిల్లా ఆద్వర్యంలో చేపట్టిన జీపు జాతా శుక్రవారం సుజాతనగర్, కొత్తగూడెం, చుంచుపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు చేరుకుంది. చుంచుపల్లిలో ఎస్టిఎఫ్ఐ జీపు జాతాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం-2020 వల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఎన్ఈపీ రద్దుచేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మీ, జిల్లా కార్యదర్శులు ఎం.వెంకటేశ్వర్లు, ఎం.రాజయ్య, ఎం.రాజయ్య, ఎం.పద్మారాణి, బి.బిక్కు, ఆడిట్ కమిటీ కన్వీనర్ డి.దాసు, సుజాత నగర్ మండల అధ్యక్షులు ఎం.రాందాస్, సుజాత నగర్ మండల ఉపాధ్యక్షులు ఆర్ఇ.జోష్ పిన్, లక్ష్మీదేవిపల్లి ఉపాధ్యక్షులు కె.వరలక్ష్మీ, చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శి పి.వేణుగోపాల్, సుజాత నగర్ మండల కోశాధికారి జి.నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేసి పాత పెన్షన్ విద్యా విదానాన్ని పునరుద్దరించాలని టిఎస్‌యుటిఎఫ్ జిల్లా ఉపాద్యక్షులు బి.మురళీమోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎస్.టి.ఎఫ్.ఐ పిలుపు మేరకు టిఎస్‌యుటిఎఫ్ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త జీపుజాతాలో భాగంగా శుక్రవారం మండల కమిటీ ఆద్వర్యంలో పర్ణశాల, నర్సాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో జీపు జాతా నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఏ.వెంకటేశ్వరావు, జిల్లా కార్యదర్వి జి.స్వర్ణజ్యోతి, విజరుకుమార్, టిఎస్‌యుటిఎఫ్ మండల అద్యక్ష కార్యదర్శిలు ఎమ్ రూపా వినరు, సంగం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చర్ల : ఎన్ఈపీ-2020, సీపీఎస్ రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ అధ్వర్యంలో మండలంలో జీప్ జాత నిర్వహించారు. జిల్లా కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, మురళీ మోహన్ మాట్లాడుతూ దేశ అక్షరాస్యత 78శాతం మాత్రమే ఉందని, ఇంకా 22శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. (అంటే ఇంకా 30 కోట్ల మంది) 3 కోట్ల మంది పిల్లలు ఇంకా బడికి దూరంగా ఉన్నారని, 15లక్షల మంది వీధి బాలలు ఉన్నారని, వీరికి విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి వీరికి బడుగు బలహీనర్గాలకు నాణ్యమైన విద్యను అందించి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఎన్ఈపీ 2020 సవరించాలని, విద్యను కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహద్యక్షులు బి.మురళీ మోహన్, జిల్లా కార్యదర్శులు విజరు కుమార్, తావుర్య, మండల అధ్యక్షులు కే.రాంబాబు, ప్రధాన కార్యదర్శి, బాలకృష్ణలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాల్వంచ : ఉపాధ్యాయ ఉద్యోగులకు సామాజిక భద్రత కరువైందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ, జిల్లా కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలని నూతన పెన్షన్స్ స్కీం ఎన్‌పీఎస్‌లు రద్దు చేయాలని కోరుతూ జీపు జాతను శుక్రవారం నిర్వహించారు. ఈ జీపు జాత పాల్వంచ మండలం నందు గల ప్రాథమికొన్నత పాఠశాల గాంధీనగర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్వంచ(బొల్లూరిగుడెం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జగన్నాధపురం నందు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ జాతలో టీఎస్‌యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, ఎం.పద్మారాణి, డి.దాసు, బి.బిక్కు, పాల్వంచ మండల అధ్యక్ష, కార్యదర్శులు కే.రాంబాబు, ఎస్.కే.యాకూబ్ పాషా, వరలక్ష్మి, జ్యోస్ఫిన్, బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.