Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం నుంచి మతతత్వపార్టీని తరిమి కొట్టాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని
ఇల్లందు : దేశంలో బీజేపీ లాంటి పార్టీలు వచ్చిన తర్వాత దేశ సమగ్రత దెబ్బతిన్నదని, ముప్పు పొంచి ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక అయిత ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన సీపీఐ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ప్రైవేటీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలను వాటి ఆస్తులన్నీ అమ్ముతున్నారని సింగరేణి నాలుగు బొగ్గు బ్లాక్లను ప్రైవేటు పరంచేసి వేలంపాటలు నిర్వహిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం వచ్చిన సందర్బంలో సింగరేణి ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పిన మోదీ బొగ్గు బ్లాక్లను వేలంవేయడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియోజకవర్గ స్థాయిలో 45 మందితో కమిటీని ఏర్పాటు చేసి వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, మహబూబాద్ జిల్లా కార్యదర్శి విజయ సారథి రెడ్డి, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు మిర్యాల రంగయ్య తదితరులు పాల్గొన్నారు.