Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దుబ్బ ధనలక్ష్మి, సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్ ఎల్.వీరభద్రంకు డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న బోజనం యూనియన్ మండల కార్యదర్శి బుగ్గ వెంకట నరసమ్మ, కీసర జయ, సీఐటీయూ మండల కమిటీ సభ్యుడు ఓరుగంటి శ్రీను, నల్లి సుజాత, సంఘం అంజమ్మ, అన్నవరపు శైలెజ, ముదిగొండ అనసూర్య, తిరుశతమ్మ, వర్షా కన్నయ్య, పద్మ, నాగలక్ష్మి, నాగమణి, అన్నపూర్ణ, ఆశ్విని, కీసరి సూజత తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : స్కీం వర్కర్ల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని కేంద్ర బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, స్కీం వర్కర్ల దేశవ్యాప్త నిరసనలలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీంలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం తాహశీల్దారు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూరమ్మ, రాజ్యలక్ష్మి, తిరుపతమ్మ, జ్వోతి, చిట్టెమ్మ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతయ్య డిమాండు చేశారు. స్కీముల రక్షణ, స్కిం వర్కర్ల హక్కుల సాధనకై సీఐటీయూ భారత కమిటి ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్ర వారం తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ, ఆశ, మిడ్డేమిల్స్ వర్కర్లు నిరసన ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, అనసూయ, పద్మ, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, పుష్ప, మండల అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : స్కీం వర్కర్ల హక్కుల పరిరక్షణకు చట్టం చేయాలని, కేంద్ర బడ్జెట్లో సరిపడ నిధులు కేటాయించి కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దారు చల్లా ప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నర్సింహారావు, అంగన్వాడి మధ్యాహ్న భోజన రంగాల కార్మికులు రాధ, రాజేశ్వరి, ఉష, కృష్ణవేణి, లక్ష్మి, సుందరీ, నాగమణి, భారతి, సీత తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల రక్షణ, స్కీమ్ వర్కర్ల హక్కుల సాధనకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక బోడు రోడ్డు నుండి తహశీల్ ఆఫీసు వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా శుక్రవారం చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ బోయిన లావణ్య కువినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అబ్దుల్ నబి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని ధ్వజమెత్తారు. 45న ఐఎల్‌సి సిఫార్సుల ప్రకారం స్కీం వర్క్లందరికీ కనీస వేతనం రూ.26000 చెల్లించాలని, అందరికీ నెలకు రూ.10వేల పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ మొదలైన అన్ని సామాజిక భద్రత చర్యలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కొండపల్లి శకుంతల, నాయకులు మజహరి, హైమా, రాజేశ్వరి, లక్ష్మి, భద్రమ్మ, అనసూర్య, చిట్టెమ్మ, నిర్మల, విజయ, కడుగుల వీరన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలోశుక్రవారం భద్రాచలం పట్టణంలో ప్రదర్శన, తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి అనంతరం మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు బి.లలిత అధ్యక్షతన జరిగిన సభలో శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్కీములలో పనిచేస్తున్న మహిళలను కార్మికులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఎన్.నాగరాజు, లక్ష్మీకాంత్, ఐకెపివివో ఏల సంఘం పట్టణ అధ్యక్షులు ఎం.వెంకటలక్ష్మి, కళావతి, రమాదేవి, యశోద, శ్యామల, అనురాధ, మహేశ్వరి, సీతారత్నం, అంగన్వాడీ యూనియన్ నాయకులు సావిత్రి, సుశీల, లక్ష్మి, మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ నాయకులు కోమల తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : స్కీం వర్కర్ల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు. నిరసనలలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ సంధ్యాకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా కాంతరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఐకేపీ, మధ్యాహ్న భోజన రంగాల కార్మికులు భవాని, సుజాత, సమ్మక్క, పద్మ, రమాదేవి, భద్రకాళి, మంగతారా, లక్ష్మి, రమాదేవి, వెంకన్న, నర్సమ్మ, మంగమ్మ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల రక్షణ, స్కీమ్ వర్కర్ల హక్కుల సాధనకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గోవింద్ సెంటర్ నుండి తహశీల్ ఆఫీసు వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కృష్ణవేణీకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తాళ్లూరి కృష్ణ, సుల్తానా, మరియా, ఫాతిమా, లక్ష్మణ్, పాశీ, రమణీ, పద్మజ, ఆదిలక్ష్మి, దయావతి, వెంకటమ్మ, సుభద్ర, పార్వతి, యశోద, పాపమా, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : స్కీముల ప్రైవేటుకరణ ఆపాలని, కార్మికులుగా గుర్తించాలని కనీస వేతన రూ.25 వేలు చెల్లించాలని సిఐటియు మండల కార్యదర్శి రామడుగు వెంకటాచారి డిమాండ్ చేశారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యా లయం అందజేశారు. కార్యక్రమంలో జనగాం రుక్మిణి, రమాదేవి, విజయలక్ష్మి, కుమారి, పుణ్యవతి పాల్గొన్నారు.