Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన విప్ రేగా
నవతెలంగాణ-పినపాక
ఫోర్త్ ఎస్టేట్‌గా ఓ పక్క సమాజం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మరో వైపు సామాజిక బాధ్యతగా పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భద్రాద్రి, ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో ఏర్పాటుచేసిన వాలీబాల్ టోర్నమెంట్‌ను డీఎస్పీ రాఘవేంద్రరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని క్రీడల కేటాయించాలన్నారు. రెండు జిల్లాల నుండి వచ్చిన సుమారు 110 టీములతో క్రీడల నిర్వహిస్తున్న ప్రెస్ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, తహసీల్దార్ ఉషా శారదా, ఎఫ్ఆర్వో తేజస్విని, సీఐ రాజగోపాల్, ఎస్సై సూరి, బీఆర్ఎస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, జడ్పీటీసీ సుభద్ర దేవి వాసుబాబు, శ్రీరామ్ హాస్పిటల్స్ డైరెక్టర్ శ్రీరామ్, లైన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కు వెంకట నర్సారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ఎంపీటీసీలు చింతపండు సత్యం కాయం శేఖర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భవాని శంకర్, బత్తుల వెంకట రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోట గంగాధర్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రమణ, బూర శంకర్, వ్యవస్థాపక అధ్యక్షులు భరత్, నాగేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీరాం బృహస్పతి, ఉపాధ్యక్షులు రమేష్, కట్టా శ్రీనివాసరావు, ట్రెజరర్ గంగాధర్ రెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి సున్నం శ్రీలత, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, క్రీడా విభాగం సారయ్య, గుమాసు శంకర్, రామకృష్ణ, వినరు, రమేష్, నరేష్, లవకుమార్, విజరు, భాస్కర్, తదితర జర్నలిస్టులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, అధికారులు ప్రజాప్రతి నిధులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.