Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
నిజాయితీకి దర్పణమే నవతెలంగాణ దినపత్రిక అని ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, ఎస్సై రతీష్, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి అర్వపల్లి రేవంత్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రములోని రైతు వేదికలో నూతన నవతెలంగాణ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక నవతెలంగాణ రిపోర్టర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ ఫయీమ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, పలు ఉపా ధ్యాయ సంఘాల నాయకులు హాజరై, మాట్లాడారు. మండలంలోని సమస్యలు వెలికి తీసి, పరిష్కరించ డంలో నవతెలంగాణ దినపత్రిక ముందు ఉందని, దానిని కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ప్రకృతి ప్రేమికులు, సమాజ సేవకులు, జాకారం గ్రామం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ షేక్ మహమూద్ పాషా మాట్లాడుతూ.. ప్రజా సమ స్యలను ఉన్నది ఉన్నట్లుగా వెలికితీయడంలో నవతె లంగాణ దినపత్రిక ప్రత్యేకత చాటుకుంటుందని అన్నారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, అక్షర సమిధ ట్రస్ట్ వ్యవస్థాపకుడు వూకె కిశోర్ బాబు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గౌరబోయిన సుబ్బారావు, మొహమ్మద్ ఖయ్యుం, పూనెం కృష్ణ, వైఎస్సార్ టీపీ మండల కన్వీ నర్ కరకపల్లి సుధాకర్, సీపీఐ ఎంఎల్ న్యూడె మోక్రసీ జిల్లా నాయకుడు సురేష్, టీఎస్ యూటీఎ ఫ్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హతిరామ్, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగా రాంబాబు, స్థానిక హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.వీరన్న, ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు భూక్య రమేష్, తునికిబండల జీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఇస్లావత్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.