Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయ, వ్యయ వివరాలను సకాలంలో సమర్పించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్బులో ఆదాయపు పన్నుశాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులకు టీడీఎస్, ఈ ఫైలింగ్, ఆదాయ వ్యయ పట్టికలు రూపకల్పన తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయు నిధులు సింహభాగం ఆదాయ వ్యయాలు చెల్లింపులు ద్వారా సమకూరతాయని చెప్పారు. ప్రతి ఉద్యోగి తన ఆదాయ, వ్యయ వివరాలతో పాటు క్రమం తప్పక సకాలంలో టీడీఎస్ చూపించాలన్నారు. సకాలంలో టిడిఎస్ చూపించక పోవడం వల్ల ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు జారీ చేయబడతాయని, తద్వారా న్యాయపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఆనాడే ఏడు ప్రాధాన్యతాంశాలను వివరించారని, ఏడు ముఖ్యమైన భాగాలతోనే రాజ్యం ఏర్పడుతుందని, ఈ ఏడు నడవాలంటే ఆదాయం ఉండాలని చెప్పారని తెలిపారు. సంవత్సర ఆదాయాన్ని మందింపు చేసి చెల్లించాల్సిన పన్నును ప్రతి నెలా సిబ్బందితో చెల్లింపు చేపించాల్సిన బాధ్యత ఆయా శాఖల జిల్లా అధికారులపైనే ఉందని ఆయన తెలిపారు. బడ్జెట్ రూపకల్పన వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.
బాధ్యతగా ఆదాయపు పన్ను చెల్లించాలని : ఎస్పీ
ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయుటకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆదాయపు పన్ను చెల్లించాలని ఎస్పీ డాక్టర్ వినీత్.జీ అన్నారు. దేశ జిడిపిలో ఆదాయపు పన్ను చాలా ప్రధానమైనదని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆదాయపు పన్ను చెల్లింపుపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ఈ సదస్సు టిడిఎస్, ఆదాయ వ్యయాలను తయారు చేయుటకు ప్రభుత్వ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. టిడిఎస్, ఈ ఫైలింగ్, ఆదాయ వ్యయ వివరాల నివేదికలు రూపకల్పనలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలు, చట్టాలు, శిక్షలు తదితర అంశాలపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ అవగాహన సమావేశంలో ఆదాయపు పన్ను శాఖ ఉప కమిషనర్ డాక్టర్ సుధాకర్ నాయక్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు బాలరాజు, సింగరేణి జియం శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.