Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
స్కీముల ప్రైవేటీకరణ ఆపాలని, స్కీములకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ మందు నిరసన ఆందోళన నిర్వహించారు. స్కీం వర్కర్ల దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలో ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు ఐకేపీ సిబ్బంది వివోఏలు అన్ని విభాగాల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లు కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి మెమోరాండం అందజేశారు. ధర్నా నిర్వహంచారు. అనంతరం పట్టణ కార్యదర్శి డి.వీరన్న అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ఉపాధ్యక్షురాలు అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిలకర పద్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజన కార్మికులు, వివోఏ, ఐకెపి తదితర రంగాలలో పనిచేస్తున్నటువంటి స్కీం వర్కర్లు కోటి మంది ఉన్నారని అదే తెలంగాణలో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు దిగువన ఉన్నటువంటి పేద, గిరిజన, దళితుల అభ్యున్నతి కోసం ఈ స్కీములు, స్కీం వర్కర్లు పనిచేస్తున్నారని చెప్పారు. అలాంటి స్కీములకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఆ స్కీములను ప్రైవేటు పరం చేస్తూ ఆ స్కీములలో పనిచేస్తున్నటువంటి స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా, తద్వారా మెల్లమెల్లగా ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తుందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కె.సత్య, భూక్య రమేష్, రమణ, కళావతి, మాధవి, హేమలత, సుక్కమ్మ, రాజ్యలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికుల రమాదేవి, మాలాన్, బి. ఆశ, వర్కర్ నాయకురాలు రమాదేవి, లలిత, తదితరులు పాల్గొన్నారు.