Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంద నరసింహారావు
నవతెలంగాణ-మణుగూరు
డీపీఈ గైడ్‌లైన్స్‌ను పక్కనపెట్టి ఐదేండ్లకి 19 శాతం సాధించుట కార్మికుల విజయమని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేబీసీసీఐ సభ్యులు మంద నరసింహారావు అన్నారు. శుక్రవారం మణుగూరు ఓసి పిట్ మీటింగ్‌లలో మాట్లాడారు. 11వ వేతన ఒప్పందం పై ఈ నెల 3న కలకత్తాలో జరిగిన సమావేశంలో 19శాతం జీతం కనీస పెరుగుదలను ఐదేండ్ల కాల పరిమితితో డీపీఈ గైడ్‌లైన్స్‌ను పక్కకు నెట్టి, కార్మికులు పోరాటాలకు సన్నద్ధమైన నేపథ్యంలో జీతంలో కనీసం పెరుగుదల 19 శాతం సాధించటాన్ని కార్మికుల విజయంగా సీఐటీయూ భావిస్తుందన్నారు. ఒక పక్కన బొగ్గు కొరత, మరొక పక్కన కార్మికులు పోరాటానికి సిద్దం కావడం అందులో భాగంగా డిసెంబర్ 9వ తారీఖున కోల్ ఇండియా, సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు విజయవంతం చేశామన్నారు. ఈ నెల జనవరి 7న రాంచిలో సదస్సు నిర్వహించి సమ్మెకు సన్నదం చేయటానికి నాలుగు జాతీయ కార్మిక సంఘాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్చలు విజయవంతం కావటానికి తోడ్పడ్డాయన్నారు. దేశవ్యాప్తంగా 10 సంవత్సరాల వేతన ఒప్పందాలు జరుగుతున్న నేపథ్యానికి, ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణ విజృంభిస్తుంది అన్నారు. ఈ తరు ణంలో దానికి భిన్నంగా ఐదేండ్లకే 19 శాతం కనీస పెరుగుదల సాధించడాన్ని సీఐటీయూ స్వాగ తించిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల కార్మికు లకు క్యాటగిరి-1 బేసిక్ రూ.1011.27 నుండి 1502.67కు పెరిగి, జీతం పెరుగుదల రూ.6973.73 ఉండగా, ఏ1 కార్మికుని రూ.47,802.53 బేసిక్ నుండి 71030.57 బేసిక్ పెరిగి కనీస జీతం పెరుగుదల, రూ.12,678.69కి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎవరి జీతాన్ని బట్టి వారికి ఈ జీతం పెరుగుదల ఉంటుందని ఆయన తెలియజేశారు. బేసిక్ పెరుగుదల 48.59శాతంగా ఉంటుందని బేసిక్ పై ఆధారపడి పెరిగే అండర్ గ్రౌండ్ అలవెన్స్, 4శాతం స్పెషల్ అలవెన్స్, హెచ్ఆర్ఏలు కూడా 48.59శాతంగా పెరగనున్నా యని ఇవి కాకుండా మిగతా అలవెన్సులు ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇతర అలవెన్సులు కూడా తదుపరి సమావేశంలో చర్చించనున్నారని ఆయన తెలియజేశారు. అలాగే గత వేతన ఒప్పందంలో మాదిరిగా మెడికల్ స్కీం, పెన్షన్, క్యాడర్ స్కీం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన 5 సబ్ కమిటీలు వేసి వాటి రిపోర్టులు వచ్చిన తరువాత పూర్తి జేబీసీసీఐ సమావేశంలో వాటిని చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఈ మొత్తం పూర్తి కావాలంటే ఇంకా రెండు మూడు నెలల సమయం పట్టొచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే ఈ పెరుగుదలలో 30శాతం ఇన్కమ్ టాక్స్ పేరుతో కేంద్రం ప్రభుత్వానికి జమ అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 8 లక్షలకు లోపు ఉన్న వారిని ఆర్థికంగా వెనుకబడిన వారుగా గుర్తించి పది శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో (దీనిపై ఇప్పటికే తమిళనాడు హైకోర్టులో ఆదాయం 8 లక్షల లోపు ఉన్న ఆదాయం వారికి పన్ను మినహా యించాలని అప్పిలు దాఖలైన నేపథ్యంలో) బొగ్గు గని కార్మికులకు కూడా 8 లక్షల లోపు ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహా ఇంపు ఇవ్వాలనే డిమాండ్‌పై బొగ్గు గని కార్మికులందరూ కూడా పోరా టానికి సిద్ధంగా ఉండాలని దానికి సీఐటీయూ ముం దు పీఠాన నిలబడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరి వెంకటరత్నం, టీవీ ఎనీ ప్రసాద్, నందం ఈశ్వరరావు, మాచారపు లక్ష్మణరావు, బొల్లం రాజు, విల్సన్ రాజు, రామ్మూర్తి, పారుపల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.