Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్ల హక్కులను పరిరక్షించాలని, ఐసీడీఎస్, ఎండీఎంఎస్ ప్రైవేటీకరణ ఆపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.జె.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. 2020, డిజిటల్ హెల్త్ మిషన్న్ని ఉపసంహరించు కోవాలన్నారు. స్కీమ్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. 45వ ఐఎస్సి సిఫారసుల ప్రకారం స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం రూ.26,000లు చెల్లించాలన్నారు. స్కీమ్ వర్కర్లందరికీ నెలకు రూ.10,000లు పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్, గ్రాట్యుటీ మొదలైన అన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఉప్పతల నరసింహారావు, నాయకులు శ్యామల హేమలత, వెంకటరమణ, అరుణ, శైలజ, చంద్రకళ, విజయ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కీంలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి : బ్రహ్మాచారి
దుమ్ముగూడెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీడీఎస్, మద్యాహ్నభోజన పధకం, ఆశా, ఎన్ఆర్హెచ్ఎం, ఐకెపి, గ్రామీణఉపాధి హామీ పధకం వంటి తదితర ప్రజా అనుకూల స్కీంలకు కేంద్రప్రభుత్వం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా అద్యక్షులు కె.బ్రహ్మాచారి డిమాండ్ చేశారు. సీఐటీయూ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు స్కీం వర్కర్ల ఆద్వర్యంలో ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధార్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్బంగా దర్నాను ఉద్దేశించి బ్రహ్మాచారి మాట్లాడుతూ.. పాలకులు ప్రభుత్వ స్కీముల పట్ల నిర్లక్ష ధోరణి ప్రదర్శిస్తూ బడ్జెట్లో కోత విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ స్కీం వర్కర్ల హక్కుల కోసం, లేబర్ కోడ్ రద్దు కోసం ఏప్రియల్ 5వ తేదీన పార్లమెంట్ ముందు లక్షల మంది కార్మికులు, రైతులు, వ్యవశాయ కార్మికులతో కలసి మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కొర్సా చిలకమ్మ, వివిద రంగాల నాయకురాళుకమలాదేవి, కృష్ణవేణి, చిన్నక్క, కనకమ్మ, నర్సమ్మ, కుమారి, పద్మ, నర్సు, చెల్లెమ్మ, తదితరులు పాల్గొన్నారు.