Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవత్వం చాటుకున్న పిచ్చేశ్వరరావు
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని ఎలకలగూడెం గ్రామానికి చెందిన కలేటి నాగేశ్వరావు పూరిల్లు శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్దం అయింది. కట్టుబట్టలతో సహా కాలి బూడిదవడంతో పాటు రూ.50 వేల నగదు, 10 క్వింటాళ్ల పత్తి, పిల్లల సర్టిఫికేట్లు, సామాన్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహుకులు శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వర రావు బాధిత కుటుంబానికి బట్టలు, వంట పాత్రలు, బియ్యం నిత్యావసర వస్తువులు వితరణగా అందజేశారు. దీంతోపాటు న్యాయవాది గురుకృష్ణ రూ.1500ల నగదు, 25 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కలేటి నరసింహారావు, ఇస్లావత్ నాగ, జగదాంబ స్వీట్స్ నిర్వాహుకులు బావ్ సింగ్ రాథోడ్, శివకామేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు.