Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుల్లో సర్పంచ్లు
- ఆరు నెలలుగా అందని బిల్లులు
- డిజిటల్ కీతో నిధులు జనరేట్ చేస్తున్న అధికారులు
- సమస్యలపై 9న కలెక్టరేట్ ముట్టడి
- సర్పంచుల సంఘం
నవతెలంగాణ-ఇల్లందు
దేశాభివృద్ధికి పట్టుకొమ్మలే గ్రామాలు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే. ప్రజల వద్దకు పాలన, త్వరితగతిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక పంచాయతీని సుమారు 5 పంచాయతీలుగా విడగొట్టింది. 500 జనాభాకు ఒక పంచాయతీ ఏర్పాలు చేశారు. ఇల్లందు మండలంలో 8 పంచాయతీలు ఉండగా 29కి చేరాయి. జిల్లాలో సుమారు 481 పంచాయతీలు 2018 ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలోపెట్టుకుని ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి 2020లో పల్లె ప్రగతిని చేపట్టింది. జనాభాను బట్టి పల్లె ప్రగతి నిధులు కేటాయించారు. పంచాయతీలో నర్సరీలు, పార్కులు, వైకుంఠధామాలు, పారిశుధ్యం, మంచినీటి సౌకర్యం, పచ్చదనం, పరిశుభ్రం కింద ఇంటింటికీ మొక్కలు నాటే కార్యక్రమాలు, సంరక్షణ, ట్రాక్టర్, చెత్తబండ్ల నిర్వహణ ఇలా అనేకం ఏర్పాటు చేశారు. పంచాయతీ జనాభాను బట్టి సుమారు 8 మంది మల్టి పర్పస్ సిబ్బందిని నియమించారు. ఒకొక్కరికి రూ.12500 వేతనం. పంచాయతీ నిర్వహణకు నెలకు సుమరు రూ.లక్ష వ్యయం అవుతోంది. ఇందులో నుండే పంచాయతీ నిర్వహణ అన్ని రకాల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఒక సంవత్సరం సజావుగానే నిధులు విడుదల చేసిన ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకున్నా అభివృద్ది, పంచాయతీల నిర్వహణ జరగాల్సిందే ఏం చేస్తారో మీఇష్టం పనులు ఆగకూడదంటూ ప్రభుత్వం, అధికారుల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులే అప్పులు తెచ్చి పంచాయతీ అభివృద్ధి, శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. బిల్లులు మూడు, ఆరు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేస్తుండటంతో అసలు, వడ్డీలు కట్టలేక సర్పంచులు సతమసమౌతున్నారు. రాష్ట్రంలో కొన్ని చొట్ల ఆత్మహత్యలు చేకున్న సంఘటలను సైతం జరి గాయి. అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వ హించారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో మార్పు కన్పించడంలేదు. దీంతో సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. పల్లెల ప్రగతి కుంటుబడింది. పల్లె ప్రగతికి చీకట్లు అలముకున్నాయి.
ఆరు నెలలుగా అందని బిల్లులు : డిజిటల్ కీతో నిధులు మళ్ళిస్తున్న అధికారులు
గత ఆరు నెలలుగా పంచాయతీల బిల్లులు ప్రభుత్వం విడుదల చేయడంలేదు. దీంతో సర్పంచ్లకు నిర్వహణ భారమైంది. కేంద్రం, రాష్ట్ర నిధులు కొద్దిగా విడుదల చేస్తున్నారు. వీటిని సర్పంచ్లు ఉపయోగించుకోకుండా చేస్తున్నారు. సర్పంచ్లకు సంబందం లేకుండా డిజిటల్ కీ ద్వార అధికారులే ట్రాక్టర్ల ఈఎంఐ, మల్టిపర్పస్ వర్కర్లకు బిల్లులు జనరేట్ చేస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యక్రామాల నిర్వహణ, గత ఆరు నెలలుగా ఆగిన బిల్లులకు సంబంధించిన నిధులు రాక అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్ధలు పడుతున్నారు.
సమస్యలపై 9న కలెక్టరేట్ ముట్టడి : సర్పంచుల సంఘం అధ్యక్షులు
సమస్యల పరిష్కారానికి 9న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కున్సోత్ కృష్ణ తెలిపారు. స్థానిక మండల పరిషత్ హాలులో శుక్రవారం సర్పంచ్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్లు స్వాతీ, పద్మా, మంగమ్మ, సరోజినీ, శ్రీను, సునీత, కృష్ణ, కౌశల్య, మంకిడి కృష్ణ, కున్సోత్ కృష్ణ తదితరులు సమస్యలపై చర్చించారు. అనంతరం ఎంపీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. గత ఆరు నెలలుగా పెండిగ్ బిల్లులు రాకపోవడంతో అప్పుల్లో కూరుకు పోయామన్నారు. ట్రాక్టర్ ఈఎంఐ, మల్టివర్కర్స్, సీసీ చార్జీలు తదితరాలు చెక్కులు కాకుండా నిలిపివే యాలని నిర్ణయించామన్నారు. జనరేట్ కాబోయే చెక్కులు నిలుపుదల చేయాలని ఎంపీడీఓలను కోరుతన్నట్లు తెలిపారు. ఎండీఓను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా అందుబాటులో లేరు.