Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజ కవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఏడాది ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య పెరిగింది. సత్తుపల్లి నియోజక వర్గంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రతీ 30 ఏండ్లకు జరిగే నియోజక వర్గాలు పునర్విభజనలో భాగంగా సత్తుపల్లి నుండి విడదీసి ఎస్టీ నియోజక వర్గంగా అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, కుక్కునూరు, వెలేరుపాడు మొత్తం 6 మండలాలతో అశ్వారావుపేట 118వ, నియోజక వర్గంగా 2009లో ఏర్పాటు చేసారు. నాడు 1,55,376 ఓటర్లు ఉన్నారు. తెలంగాణ పునర్విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో 1,64,419 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల అనంతరం కుక్కునూరు, వెలేరుపాడు ఆంధ్రప్రదేశ్లో విలీనం కాగా తెలంగాణలో మండలాలు పునర్విభజనలో అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మొత్తం 5 మండలాలతో నియోజకవర్గం రూపొందించారు. 2018 ఎన్నికల్లో ఈ అయిదు మండలాల్లో 1,42,571 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల జాతా జాబితా ప్రకారం 1,49,322 ఓటు హక్కు కలిగి ఉన్నారు. అంటే గత ఎన్నికల కంటే రానున్న ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్య 6,751కి పెరిగింది. మొత్తం ఓటర్లు 1,49,322 కు గాను 76,305 మంది మహిళలు, 73,009 మంది పురుషులు, 8 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే 3,404 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఒక్క అన్నపురెడ్డిపల్లి మండలం మినహా మిగతా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.మండలాల వారీగా ఓటర్ల వివరాలు పరిశీలిస్తే...